ఆ గ్రామంలో దొంగల బీభత్సం.. ఒకే రోజు రెండు ఇండ్లలో చోరీ..

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొల్గట్ పల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఒకేసారి మూడు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది.

Update: 2024-12-14 05:09 GMT

దిశ, అచ్చంపేట : నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బొల్గట్ పల్లి గ్రామంలో శుక్రవారం అర్ధరాత్రి తాళాలు వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తూ ఒకేసారి మూడు ఇళ్లలో దొంగతనాలకు పాల్పడిన సంఘటన చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామంలో తాళాలు వేసి ఉన్న ఇండ్లను టార్గెట్ గా చేసుకొని గుర్తు తెలియని వ్యక్తులు అర్ధరాత్రి పూట ఇళ్లల్లో చొరబడి బీరువా తాళాలు పగులగొట్టి నగలు, డబ్బులు ఎత్తుకెళ్లారని తెలిపారు.

రెండు కుటుంబాల వారు రాత్రిపూట వ్యవసాయ పొలంలో పంటకు కాపలాగా వెళ్లగా, మరో కుటుంబానికి చెందిన వారు అచ్చంపేట పట్టణానికి వెళ్లారని అన్నారు. అ విషయాన్ని పసిగట్టిన గుర్తు తెలియని వ్యక్తులు దొంగతనానికి పాల్పడ్డారని గ్రామస్తులు తెలిపారు. మూడు ఇళ్లల్లో లక్షకు పైగా నగదు, నాలుగు తులలా బంగారం, 40 తులాల వెండి ఎత్తుకెళ్లారని బాధితులు వాపోయారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుల నుండి వివరాలు సేకరిస్తున్నారు. దొంగల ఆచూకీ తెలుసుకునేందుకు క్లూస్ టీం జాగిలాన్ని రప్పిస్తున్నారు.


Similar News