గజ్జుమన్న డెడ్రా.. మహిళ పై చిరుత దాడి..
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి దాడిలో ఓ మహిళ మృతి చెందడం, పలువురు గాయపడడం, బోథ్ నియోజకవర్గంలో చిరుత ఆవుల పై దాడి చేయడం..
దిశ, నేరడిగొండ : ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పులి దాడిలో ఓ మహిళ మృతి చెందడం, పలువురు గాయపడడం, బోథ్ నియోజకవర్గంలో చిరుత ఆవుల పై దాడి చేయడం.. ఈ ఘటనలు మరవకముందే.. శనివారం ఉదయం చిరుత ఓ మహిళపై దాడి చేసింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం బజార్ హత్నూర్ మండలంలోని డెడ్రా గ్రామానికి చెందిన మహిళ బహిర్భూమికి వెళ్లిన సమయంలో చిరుత పులి దాడి చేసింది. చిరుత దాడిలో మహిళకు గాయాలవ్వడంతో ఆమెను మండల కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం జిల్లా కేంద్రంలోని రిమ్స్ కు తరలించారు. మహిళ పై చిరుత దాడి చేయడంతో గ్రామస్తులు భయాందోళన చెందుతున్నారు. వ్యవసాయ పనులకు వెళ్లాలంటే భయపడుతున్నారు.