Telangana Food Commission : జక్లేర్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషన్ తనిఖీలు

రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళలో, గురుకుల, సంక్షేమ హాస్టల్స్ లో తరచూ ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే.

Update: 2024-12-13 13:31 GMT

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో ప్రభుత్వ స్కూళ్ళలో, గురుకుల, సంక్షేమ హాస్టల్స్ లో తరచూ ఫుడ్ పాయిజన్(Food Poison) ఘటనలు వెలుగు చూస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తెలంగాణ ఫుడ్ సేఫ్టీ కమిషన్(Telangana Food Commission) ప్రభుత్వ పాఠశాలల్లో ఆకస్మిక తనిఖీలు(Inspectios) చేపడుతోంది. ఈ క్రమంలో శుక్రవారం నారాయణపేట(Narayanapeta) జిల్లా మక్తల్ నియోజకవర్గంలోని జక్లేర్(Jaklar) ఉన్నత పాఠశాల(High School) మధ్యాహ్న భోజనాన్ని తనిఖీ చేసింది. భోజనంలో నాణ్యతను పరిశీలించి.. విద్యార్థులకు రుచికరమైన, నాణ్యతతో కూడిన వేడి ఆహారాన్ని మెనూ ప్రకారం అందించాలని సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించింది. ఇకపై ప్రభుత్వ స్కూల్స్, హాస్టల్స్ లో తరుచూ తనిఖీలు జరుపుతామని.. నాణ్యత లేకపోతే చర్యలు తీసుకుంటామని ఈ సందర్భంగా హెచ్చరించారు.    

Tags:    

Similar News