పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీళ్లు

పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు అందోళనకు దిగిన సంఘటన వెల్దండ మండల కేంద్రంలోని పవనపుత్ర పెట్రోల్ బంక్ లో గురువారం చోటుచేసుకుంది.

Update: 2025-03-20 15:35 GMT
పెట్రోల్ బంకులో పెట్రోల్ కు బదులు నీళ్లు
  • whatsapp icon

దిశ,వెల్దండ: పెట్రోల్ బంక్ లో పెట్రోల్ కు బదులుగా నీళ్లు వస్తున్నాయని వినియోగదారులు అందోళనకు దిగిన సంఘటన వెల్దండ మండల కేంద్రంలోని పవనపుత్ర పెట్రోల్ బంక్ లో గురువారం చోటుచేసుకుంది. మండల పరిధిలోని గుండాల గ్రామానికి చెందిన పర్వత్ రెడ్డి బుధవారం రాత్రి బైక్ లో పెట్రోల్ పోసుకొని కొద్ది దూరం వెళ్లగానే బైకు ఆగిపోయింది. దీంతో మళ్ళీ కొద్ది దూరం వెళ్ళగానే మళ్లీ ఆగిపోయింది. వెంటనే బైక్ మెకానిక్ వద్దకు వెళ్లి చూడగా.. బైక్ ఎంతకు స్టార్ట్ కాకపోయేసరికి ఇంటికి వెళ్ళాడు. దీంతో గురువారం బైకు నుండి పెట్రోల్ బయటకు తీసేసరికి పెట్రోల్ కు బదులుగా నీళ్లు రావడంతో.. తిరిగి పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్లి వారిని అడిగారు. వాళ్ళు ఏం సమాధానం ఇవ్వలేదు. పెట్రోల్ బంక్ యజమాని మీద చర్యలు తీసుకోవాలని వినియోగదారుడు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు మేరకు పౌర సరఫరా శాఖఅధికారులు పెట్రోల్ బంకు వద్దకు వచ్చి విచారణ చేపట్టి కొలతలు, రికార్డులను పరిశీలించి, పెట్రోల్ శాంపిల్ సేకరించి ల్యాబ్ కు పంపిస్తామన్నారు.

Similar News