కృష్ణ జలాలతో నా రైతుల పాదాలు కడుగుతా - ఎమ్మెల్యే గువ్వల బాలరాజు

కృష్ణమ్మ జలాలతో నా అచ్చంపేట రైతుల పాదాలు కడుగుతానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..

Update: 2023-10-07 09:15 GMT

దిశ, అచ్చంపేట : కృష్ణమ్మ జలాలతో నా అచ్చంపేట రైతుల పాదాలు కడుగుతానని ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు అన్నారు. శనివారం పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో అధికారులతో కలిసి మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..రేపు అనగా ఆదివారం జిల్లాలోని అచ్చంపేటలో పట్టణంలో నిర్వహించే ప్రగతి నివేదిక సభ ను విజయవంతం చేయాలని నియోజకవర్గం రైతులను, ప్రజలను కోరారు. సీఎం కేసీఆర్ సహాయ సహకారాలతో కృష్ణా జలాలతో అచ్చంపేట ప్రాంత రైతుల పాదాలు కడుగుతానని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి స్వయాన రైతు కావడంతో రాష్ట్రంలోని ప్రతి సెంటు గుంటాకు నీరు అందించడమే లక్ష్యంగా ముందుకు పోతున్నారని తెలిపారు. ఉప్పునుంతల మండల కేంద్రంలో 30 పడకల నూతన ఆసుపత్రి భవనాన్ని మంత్రి కేటీఆర్ ప్రారంభించనున్నట్లు వివరించారు. అలాగే అచ్చంపేట పట్టణంలో ఉమామహేశ్వర ప్రాజెక్ట్ పైలాన్ ప్రారంభం అనంతరం నిర్వహించే బహిరంగ సభలో కేటీఆర్ పాల్గొంటారన్నారు.

ఇతర ప్రతిపక్ష పార్టీలు ప్రాజెక్టులకు సహకరించాలని, కాళ్ళలో కట్టలు పెట్టరాదని ప్రతిపక్ష పార్టీలకు సూచించారు. బల్మూర్ మండల కేంద్రంలో 2.3 టీఎంసీల నీటి సామర్థ్యం నిల్వ చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమానికి రైతులు, కర్షకులు, కార్మికులు పార్టీ క్యాడర్ పెద్ద ఎత్తున హాజరై విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సమన్వయ సమితి జిల్లా అధ్యక్షులు మనోహర్, మున్సిపల్ చైర్మన్ నరసింహ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ శ్రీమతి అరుణ శ్రీనివాస్, మున్సిపల్ వైస్ చైర్ పర్సన్ శ్రీమతి శైలజా విష్ణువర్ధన్ రెడ్డి, జడ్పిటిసి రాంబాబు నాయక్, కౌన్సిలర్లు, డి.ఎస్.పి, ఆర్డిఓ, సిఐలు, ఎస్ఐలు, స్థానిక నాయకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News