ఓటరు జాబితాను పారదర్శకంగా రూపొందించాలి

ఓటరు జాబితా ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు.

Update: 2024-09-18 13:50 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి : ఓటరు జాబితా ఎలాంటి తప్పులు లేకుండా పారదర్శకంగా తయారు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సిక్త పట్నాయక్ అన్నారు. బుధవారం జిల్లా కలెక్టర్ చాంబర్లో రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల జాబితాను ఎలాంటి తప్పులు లేకుండా తయారు చేస్తున్నట్లు తెలిపారు. భార్యాభర్తలు ఒకే వార్డులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

    13.9. 24న డ్రాఫ్ట్ ఫొటో ఎలక్టరోల్ రోల్స్ గ్రామపంచాయతీ నిర్వహించినట్లు, 19న అన్ని రాజకీయ పార్టీలతో మండల్ లెవెల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. 26న ఆబ్జెక్షన్స్, 28న ఫైనల్ పబ్లికేషన్ ఆఫ్ ఫొటో ఎలక్టరల్ రోల్స్ ఉంటుందని తెలిపారు. ఇప్పటికే అన్ని గ్రామపంచాయతీలు, ఎంపీడీఓ, తహసీల్దార్ కార్యాలయాలలో ఓటరు జాబితాను అందజేశామని, వాటి పరిశీలన అనంతరం చివరిగా జాబితా సిద్ధం చేయనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా నారాయణపేట పరిధిలోని జాజాపూర్ లో 12 వార్డులు ఉండగా ఒక కుటుంబం ఒకే దగ్గర ఆ జాబితాలో లేదని రాజకీయ పార్టీ ప్రతినిధులు అన్నారు. కొత్తగా తయారయ్యే జాబితా తమకు ఇవ్వాలని ప్రతినిధులు కోరారు.

Tags:    

Similar News