వికారాబాద్ జిల్లా కలెక్టర్‌పై రాళ్ల దాడి

ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతుల ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ..వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు.

Update: 2024-11-11 15:20 GMT

దిశ, కోస్గి : ఫార్మా కంపెనీ ఏర్పాటును వ్యతిరేకిస్తున్న రైతుల ప్రజాభిప్రాయ సేకరణకు వచ్చిన ..వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ కారుపై గ్రామస్తులు రాళ్లతో దాడి చేశారు. ఫార్మా సిటీ భూసేకరణపై చర్చించేందుకు కలెక్టర్, తహశీల్దార్ లగచర్ల గ్రామానికి వెళ్లారు. అయితే ఊరికి 2 కి.మీ. దూరంలో గ్రామసభ ఏర్పాటు చేయడంపై గ్రామస్తులు నిరసన తెలిపారు. కలెక్టర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కలెక్టర్, తహసీల్దార్‌ వాహనాలపై గ్రామస్తులు దాడి చేశారు. ఈ దాడిలో మూడు వాహనాలు ధ్వంసమయ్యాయి. కలెక్టర్‌పై ఓ మహిళ చేయి చేసుకున్నట్లు సమాచారం. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో భారీగా పోలీసులను మోహరించారు. రైతులు అధికారుల వాహనాలను రాళ్లు కర్రలతో ధ్వంసం చేశారు.


Similar News