నష్టపరిహారం చెల్లించండి సారు..
పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సోమవారం ప్రజావాణిలో విన్నవించుకున్నారు.
దిశ, నాగర్ కర్నూల్ : పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కింద భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సోమవారం ప్రజావాణిలో విన్నవించుకున్నారు. భూమి కోల్పోయిన బాధితులు తెలిపిన వివరాల ప్రకారం బిజినేపల్లి మండలం లింగసానిపల్లి గ్రామానికి చెందిన బి.మశన్న, బాలరాజుతో పాటు మరో పదిమందికి కలిపి మొత్తం 3.35 ఎకరాల భూమిని కోల్పోయారు. అప్పుడున్న ప్రభుత్వం కొంత నష్టపరిహారం చెల్లించింది. మిగతా డబ్బుల కోసం కలెక్టరేట్లోని అధికారుల చుట్టూ కాళ్లు అరిగేలా తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు తమ ఆవేదనను మీడియాతో చెప్పుకున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి మిగతా నష్టపరిహారాన్ని వెంటనే చెల్లించాలని రైతులు కోరుతున్నారు.