కృష్ణ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలు ప్రారంభం..
మక్తల్ నియోజకవర్గంలో సరిహద్దులో ఉన్న కృష్ణ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను శనివారం సాయంత్రం సీఐ సీతయ్య ప్రారంభించారు.
దిశ, మక్తల్: మక్తల్ నియోజకవర్గంలో సరిహద్దులో ఉన్న కృష్ణ బ్రిడ్జిపై వాహనాల రాకపోకలను శనివారం సాయంత్రం సీఐ సీతయ్య ప్రారంభించారు. గత ఐదు రోజులుగా సరిహద్దు ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. నేటితో బాధలు తీరాయని వాహనదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నారాయణపేట జిల్లాలోని మక్తల్ నియోజకవర్గంలోని నేషనల్ హైవే 167 కృష్ణ (బ్రిడ్జ్) వంతెన పై మరమ్మత్తులు గాను గత ఐదు రోజులుగా వాహనాల రాకపోకలను నిలుపుదల చేశారు.
వంతెనపై మరమ్మత్తులు శనివారంతో పూర్తయినందున సీఐ సీతయ్య, కృష్ణ ఎస్ఐ విజయ భాస్కర్ ఇంజనీరింగ్ అధికారులు వంతెన పై మరమ్మతులను రహదారిని పరిశీలించారు. అనంతరం ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ఎన్ వెంకటేశ్వర్లు దృష్టికి తీసుకెళ్లగా మరమత్తు పనులు నాణ్యతతో పూర్తి కావడంతో శనివారం సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో నారాయణపేట జిల్లా సరిహద్దు కృష్ణ బ్రిడ్జిపై రాయిచూర్ కి వాహనాల రాకపోకలు కొనసాగించాలని ఆదేశించడంతో సీఐ సీతయ్య వాహనాల రాకపోకలను ప్రారంభించారు.