రెండు ఆటోలు ఢీకొని ఒకరి మృతి.. పెళ్లి వస్త్రాలు తీసుకొస్తుండగా ఘటన..

రెండు ఎదురెదురుగా ఆటోలు ఢీకొన్న సంఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు.

Update: 2023-02-12 16:05 GMT

దిశ, నాగర్ కర్నూల్ ప్రతినిధి: రెండు ఎదురెదురుగా ఆటోలు ఢీకొన్న సంఘటనలో ఓ మహిళ మృతి చెందగా మరో 8మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. అవుసలికుంట గ్రామానికి చెందిన పెళ్లి కూతురు బంధువులు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలో పెళ్లి వస్త్రాలు తీసుకొని సొంత గ్రామానికి ఆటోలో తిరుగు పయనమయ్యారు. ఈ నేపథ్యంలో నాయనోనిపల్లి మైసమ్మ వద్ద చిరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్న రాజస్థాన్ ప్రాంతానికి చెందిన మార్వాడీలు పనులు ముగించుకొని పెద్దకొత్తపల్లికి ఆటోలో వస్తున్నారు.

కాగా పెద్దకొత్తపల్లి మండల శివారులో రెండు ఆటోలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. దీంతో అవుసలికుంటకు చెందిన పెళ్లి కూతురి చిన్నమ్మ చిట్టెమ్మ (40), అక్కడికక్కడే మృతి చెందింది. తల్లి లింగమ్మ తీవ్రంగా గాయపడింది. మరొక ఆటోలో ప్రయాణిస్తున్న మార్వాడీకి చెందిన చిరు వ్యాపారులు సుమారు ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వెంటనే పెద్దకొత్తపల్లి కొల్లాపూర్ కు చెందిన 108 వాహనాలు క్షతగాత్రులను వెంటనే నాగర్ కర్నూల్, పెద్దకొత్తపల్లి మండల కేంద్రంలోని ఆసుపత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు.

Tags:    

Similar News