పోడు సాగు అనుమతి కోసం ఎఫ్ఆర్వో కు గిరిజనుల వినతి
తమకు ప్రభుత్వం ఆర్ఓఎఫ్ కింద భూములకు పట్టాలు ఇచ్చారని,వచ్చే సీజన్ పంట సాగుకు అనుమతి ఇవ్వాలని అమరగిరి గూడెం బాధిత ఆదివాసులు కోరుతూ గురువారం కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.
దిశ, కొల్లాపూర్: తమకు ప్రభుత్వం ఆర్ఓఎఫ్ కింద భూములకు పట్టాలు ఇచ్చారని,వచ్చే సీజన్ పంట సాగుకు అనుమతి ఇవ్వాలని అమరగిరి గూడెం బాధిత ఆదివాసులు కోరుతూ గురువారం కొల్లాపూర్ ఫారెస్ట్ రేంజ్ చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు. అమరగిరి లో పచ్చర్ల గుంత ప్రాంతంలో నిమ్మల నాగన్న కు 6.5 ఎకరాలు, పురుషాల మల్లయ్య 2ఎకరాల8 గుంటలు, పెద్ద లింగన్నకు 1.26ఎకరాలు, ఐలేని కురుమ య్య కు 3.6 ఎకరాలు,నిమ్మల మల్లయ్య కు 5.8 ఎకరాలు, ఐ లేని శివ కు 2.10 ఎకరాల భూములకు తమకు ఆర్ ఓ ఎఫ్ పట్టాలు ఉన్నాయని, భూముల్లో పంట సాగుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ ఎఫ్ఆర్వో చంద్రశేఖర్ కు వినతి పత్రాన్ని అందజేశారు.