ఎరుకల జాతి అభివృద్ధికి కృషి..

ఎరుకల జాతి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఉల్లం గొండ్ల రాజు అన్నారు.

Update: 2024-12-26 15:19 GMT

దిశ, లింగాల : ఎరుకల జాతి అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు  తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షులు ఉల్లం గొండ్ల రాజు అన్నారు. గురువారం దిశ దిన పత్రికతో వారు మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఎరుకల సంఘం అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు ప్రతి ఒక్కరికీ కృతజ్ఞత తెలిపారు. ఈ సందర్భంగా బండి నర్సిములును రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నిక చేయడం జరిగిందన్నారు. రాజు, నర్సింలు తమ అనుభవంతో ఎరుకల జాతి అభివృద్ధికి కృషి చేయాలని,ఏకలవ్య గ్లోబల్ ఫెడరేషన్ ఈజీఎఫ్ జాతి సంక్షేమం కోసం పని చేస్తున్న ప్రతిష్టాత్మక సంస్థగా..విద్య, ఆరోగ్యం, ఆర్థిక అభివృద్ధి వంటి రంగాల్లో ఎరుకల కులం సమాజానికి సేవలు అందించాలన్నారు. భవిష్యత్తులో ఎరుకల సంఘం సంస్కృతిని ప్రోత్సహించడం వంటి కార్యక్రమాలను చేపట్టాలని ఈజీఎఫ్ కోరుకుంటుందని తెలిపారు.


Similar News