consumer rights : వినియోగదారుల హక్కుల పరిరక్షణకు పాటుపడాలి..
వినియోగదారుల హక్కుల పరిరక్షణకు నిస్వార్థంగా పాటుపడాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు.
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్ : వినియోగదారుల హక్కుల పరిరక్షణకు నిస్వార్థంగా పాటుపడాలని జిల్లా కలెక్టర్ విజయేందిర బోయి అన్నారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ నూతనంగా ఏర్పడిన ఉమ్మడి జిల్లా కమిటీ గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ విజయేందిర బోయిని కలిసినపుడు వారినుద్దేశించి ఆమె మాట్లాడారు. కమిషన్ ఏర్పాటు సంతోషంగా ఉందని, ప్రజలకు సంబంధించిన కార్యక్రమాలకు తన ప్రోత్సాహం ఉంటుందని, నిబంధనలకు కట్టుబడి పని చేయాలని ఆమె సూచించారు.
బాధ్యతగా వ్యవహరించండి...
నూతనంగా ఏర్పడిన జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ కమిటీ సభ్యులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ జానకి సూచించారు. ఈ సందర్భంగా గురువారం కమిటీ సభ్యులు పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆమెను కలిసి పూల మొక్కను బహుకరించి, తమ కమిషన్ చేసే కార్యక్రమాలకు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమాలలో కమిషన్ దక్షిణ భారత బాధ్యుడు మనోహర్ గౌడ్, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా చైర్మెన్ బాల్ రాజ్, వైస్ చైర్మెన్ మడుగు శివశంకర్, ప్రధాన కార్యదర్శి ఎం.చందు, కార్యదర్శి అలి, మీడియా కార్యదర్శి అండ్ అడ్వజర్ రాజసింహుడు తదితరులు పాల్గొన్నారు.