దొంగలు హల్ చల్.. సర్పంచ్ మెడలోని బంగారం చోరీ
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్
దిశ, అచ్చంపేట: నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట మున్సిపల్ కేంద్రంలో శనివారం అర్ధరాత్రి దొంగలు హల్చల్ చేసిన సంఘటన చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పదరా మండలం ఉడిమిళ్ళ గ్రామానికి చెందిన సర్పంచ్ శారదా భాస్కర్ అచ్చంపేట పట్టణంలోని నివాసముంటున్నారు. శనివారం అర్థరాత్రి దొంగ రెండు ఇండ్లలో దొంగతనానికి ఒడిగట్టారని బాధితులు వాపోయారు.
వివరాల్లోకి వెళితే... శనివారం అర్ధరాత్రి అచ్చంపేట పట్టణంలోని వెంకటేశ్వర కాలనీలో రాత్రి రెండు దాటిన తర్వాత ఒక గుర్తు తెలియని వ్యక్తి పలు ఇండ్లలో దొంగతనానికి ఒడిగట్టాడని, ఈ క్రమంలో సర్పంచ్ శారదా భాస్కర్ గత ఆరు నెలల క్రితం పై కాలనీలో రెండో ఫోర్ లో అద్దెకు ఉంటున్నారు. ఈ సందర్భంగా "దిశ" తో బాధిత కుటుంబం శారదా భాస్కర్ ఫోన్ ద్వారా మాట్లాడుతూ.. శనివారం ఎప్పటి మాదిరిగానే ఇంట్లోనే నిద్రిస్తున్నామన్నారు.
బెడ్ రూమ్ లోకి...
మేము నిద్రలో ఉన్న సమయంలో రాత్రి రెండు గంటల 50 నిమిషాల ప్రాంతంలో గుర్తుతెలియని దొంగ మూసుకొని ఉన్న గది తలుపులను తీసుకొని ఏకంగా బెడ్ రూమ్ లోకి వచ్చేసి గాఢ నిద్రలో నిద్రిస్తున్న భార్య మెడలో ఉన్న పుస్తెలతాడు, దానితో పాటు ఉన్న పుస్తెను బంగారాన్ని అపహరించుకుని పారిపోయాడని తెలిపారు. తర్వాత సర్పంచ్ శారద భాస్కర్ కు నిద్రలో మెడ కాస్త మంట రావడంతో లేచి చూడగా మెడలో బంగారం లేకుండా పోయిందని, దొంగ బంగారం ఎత్తుకెళ్లే సమయంలో ఇంకేమైనా చేసి ఉంటే చాలా నష్టం జరిగేదని బాధితులు వాపోయారు. దాంతో రాత్రంతా నిద్ర పట్టక ఆందోళనలో ఉన్నామని పేర్కొన్నారు.
సీసీ ఫుటేజీల్లో దొంగ..
ఆదివారం ఉదయం లేచాక మేము ఉంటున్న ఇంటి వెనుక బజార్లో అదే దొంగ ఆ ఇంట్లో జోరబడి దొంగతనం చేయుటకు ప్రయత్నించగా.. తాను ఏ విధంగా ఆ ఇంట్లోకి చొరబడ్డాడు, ఇంటి నుండి మరో ఇంట్లోకి వెళ్లేందుకు ఎలా ప్రయత్నం చేశాడు. ఆ దొంగ కదలికలు అంతా కూడా సీసీ కెమెరాలలో నమోదు అయ్యాయి. తర్వాత సీఐ అనుదీప్ మరియు ఎస్ఐ కలిసి జరిగిన సంఘటనలు చెప్పగా... సార్ కానిస్టేబుల్ పంపిస్తానని చెప్పడని తెలిపారు.
పట్టణంలో వరుస దొంగతనాలు..
అచ్చంపేట పట్టణంలో గత కొంత కాలం నుండి వరుస దొంగతనాలు జరుగుతుండడంతో అటు పట్టణవాసులకు ఇటు పోలీసులకు ఒక సవాలుగా మారింది. గతంలో టీచర్స్ కాలనీలో కూడా ఒక ఇంట్లో అర్ధరాత్రి దొంగ చొరబడి పై సంఘటన మాదిరిగానే నిద్రలో ఉన్న గృహిణి మెడలో నుండి సుమారు నాలుగు తులాల బంగారాన్ని ఎత్తుకెళ్లిన సంఘటన చోటు చేసుకున్నదని పట్టణవాసులు చర్చించుకుంటున్నారు. అలాంటి సంఘటన శనివారం అర్ధరాత్రి చోటు చేసుకోవడంతో పట్టణంలో కాలనీవాసులు ఆందోళన చెందుతున్నారు.
ముమ్మాటికి నిఘా వైపల్యమే.!
అచ్చంపేట పట్టణంలో దొంగల హల్చల్ గత కొంతకాలంగా జరుగుతుండడం, ఆ వ్యక్తులను ఛేదించడంలో పోలీసులు విఫలం చెందడం మూలంగానే వరుస సంఘటనలు జరుగుతున్నాయని పట్టణవాసులు పోలీసుల తీరుపై పెదవి విరుస్తున్నారు. నిఘా వ్యవస్థను మరింత పటిష్టం చేసి పట్టణవాసులకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు.
Also Read : ఆఫీసర్‌లా కనిపిస్తున్న ఇతను.. చిన్నారిని ఎలా ఎత్తుకెళ్తున్నాడో చూడండి (వీడియో)