సర్వే లిస్టింగ్ పనులు నేటితో పూర్తి చేయాలి

జిల్లాలో నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, సమగ్ర ఇంటింటి సర్వే లిస్టింగ్ పనులను నేటితో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శు

Update: 2024-11-08 15:40 GMT

దిశ, గద్వాల కలెక్టరేట్ : జిల్లాలో నిర్వహిస్తున్న సామాజిక, ఆర్థిక, విద్య, ఉపాధి, రాజకీయ, కుల, సమగ్ర ఇంటింటి సర్వే లిస్టింగ్ పనులను నేటితో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం గద్వాల మున్సిపల్ పరిధిలోని న్యూ హౌసింగ్ బోర్డ్ కాలనీలో ఎన్యూమరేటర్ల నిర్వహిస్తున్న ఇంటింటి సర్వేను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖి చేశారు. ప్రతి ఇంటికి స్టికర్ వేసారా లేదా అని పరిశీలించారు. ఇంకా ఎన్ని ఇండ్లు మిగిలి ఉన్నాయని మున్సిపల్ మేనేజర్ ను అడుగగా.. ఆయన మ్యాప్ ద్వారా పూర్తి వివరాలను కలెక్టర్ కు వివరించారు. పూర్తి కానీ వార్డులన్నీ ఈరోజు పూర్తి చేయాలని సూచించారు. సర్వేకి అవసరమైన ఫారాలు, ఇతర సామాగ్రి, సందేహాలు తదితర అంశాలపై మరోసారి ఎన్యూమరేటర్లకు కలెక్టర్ స్పష్టంగా వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లక్ష్మీనారాయణ, తహశీల్దార్ మల్లికార్జున్, మున్సిపల్ మేనేజర్ ఎల్లారెడ్డి, ఎన్యూమరేటర్లు, తదితరులు పాల్గొన్నారు.


Similar News