అభివృద్ధి ఫలాలను అర్హులకే దక్కాలి- జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్

Update: 2024-08-28 10:06 GMT

దిశ, వనపర్తి : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అల్ప సంఖ్యాక వర్గాల అభ్యున్నతి కోసం అమలుచేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాల ఫలాలను అర్హులైన లబ్ధిదారులకే అందేలా చర్యలు తీసుకోవాలని జాతీయ మైనారిటీ కమిషన్ సభ్యులు సయ్యద్ షహాజాది ఆదేశించారు. సయ్యద్ షహజాది జిల్లా కేంద్రంలోని తెలంగాణ మైనారిటీ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి టిఫిన్ చేశారు. గురుకుల అందిస్తున్న భోజనం, విద్యా వసతులను విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం గురుకుల పాఠశాల, కళాశాల ప్రిన్సిపల్ లు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమావేశంలో సయ్యద్ షహజాది మాట్లాడుతూ అల్పసంఖ్యాకు వర్గం ప్రజల అభ్యున్నతి కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు 60 - 40 నిష్పత్తి తో గురుకుల పాఠశాలలను ఏర్పాటు చేసామన్నారు. నాణ్యత తో కూడిన భోజనం,విద్యను అల్పసంఖ్యాకాక విద్యార్థులు ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని ఐ.డి.ఒ.సి సమావేశ మందిరంలో జిల్లా కలక్టర్ ఆదర్శ్ సురభి తో కలిసి ఆయా శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. కలెక్టర్ ఆదర్శ్ సురభి మాట్లాడుతూ అల్ప సంఖ్యాక వర్గాల అభ్యున్నతి కొరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి ఒక్కరికీ అందే విధంగా జిల్లా యంత్రాంగం పనిచేస్తుందని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆర్. గిరిధర్ మాట్లాడుతూ జిల్లాలో త్రిబుల్ తలాక్ వంటి కేసులు నమోదు కాలేదని, శాంతి భద్రతల విషయంలో ఎలాంటి సమస్యలు లేవని చెప్పారు. ఈ కార్యక్రమంలో అదనపు కలక్టర్ లు సంచిత్ గంగ్వార్, నగేష్, ఆర్డీఓ పద్మావతి, విద్యా, ఆయా శాఖలజిల్లా అధికారులు తహశీల్దార్లు, ఎ తెలంగాణ మైనారిటీ సంస్థల అర్ ఎల్ సీ కిరణ్మయి,ప్రిన్సిపల్ లు సౌమ్య,హవీల రాణి,కళాశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News