డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా చూడాలి

పట్టణంలో ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం కలగకుండా చూడాలని మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు.

Update: 2025-03-20 15:47 GMT
డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం లేకుండా చూడాలి
  • whatsapp icon

దిశ, ప్రతినిధిమహబూబ్ నగర్: పట్టణంలో ఎక్కడ కూడా డ్రైనేజీ వ్యవస్థకు ఆటంకం కలగకుండా చూడాలని మహబూబ్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ స్పెషల్ ఆఫీసర్,స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ శివేంద్ర ప్రతాప్ ఆదేశించారు. గురువారం ఆయన కమీషనర్ మహేశ్వర్ రెడ్డి తో కలిసి స్థానిక శ్రీనివాస కాలనీలోని 6, 7వ వార్డులో డ్రైనేజీ వ్యవస్థను,పరిసరాల పరిశుభ్రతను,డ్రైనేజీ పారే కాల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డ్రైనేజీ సక్రమంగా లేకపోవడంతో వర్షపునీరు,మురుగు నీరు రోడ్లపైకి చేరి దుర్వాస వెలువడి,దోమలు,ఈగలతో రోగాలు ప్రభలుతున్నాయని స్థానిక నివాసస్తులైన రాజసింహుడు,జనార్థన్ రెడ్డి,రత్నాకర్ రెడ్డి లు తెలిపారు. కాలనీలోని డ్రైనేజీ కాల్వలపై ఉన్న స్లాబ్ల్ కింద డ్రైనేజీ ఆగిపోయి రోడ్లపైకి ఉబికి వస్తుందని,కాల్వలను వెడల్పుగా నిర్మించాలని కోరారు. వెంటనే మరమ్మతులు చేపట్టి సమస్య పరిష్కారించాలని,నిత్యం శానిటేషన్ సక్రమంగా చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ మహేశ్వర్ రెడ్డి,సానిటరీ ఇనిస్పెక్టర్ రవీందర్ రెడ్డి లకు ఆయన ఆదేశించారు. ఆయన వెంట వార్డు జవానులు సిరాజొద్ధీన్,శ్యాం సుందర్,తదితర మున్సిపల్ సిబ్బంది ఉన్నారు.


Similar News