నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత .. ఇంతకీ ఏమైనట్టు..?

నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది.

Update: 2025-03-18 15:15 GMT
నాగర్ కర్నూల్ కలెక్టరేట్ ఎదుట ఉద్రిక్తత .. ఇంతకీ ఏమైనట్టు..?
  • whatsapp icon

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయం ముందు ఉద్రిక్తత వాతావరణం చోటుచేసుకుంది. మంగళవారం అంగన్వాడి టీచర్లు తమ సమస్యలను పరిష్కరించాలని సిఐటియు నాయకులతో కలిసి కలెక్టర్ కార్యాలయం ముందు 48 గంటల ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ధర్నా చేస్తున్న సిఐటియు నాయకులను అరెస్టు చేశారు. అంగన్వాడీలు పోలీస్ వాహనాన్ని అడ్డుకున్నారు. దీంతో కొంత పరిస్థితి నెలకొంది.

ఈ సందర్భంగా సిఐటియు జిల్లా నాయకులు పర్వతాలు మాట్లాడుతూ.. తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అంగన్వాడీలకు 18వేల వేతనం ఇస్తామని వారిని మోసం చేసిందని మండిపడ్డారు.అంగన్వాడీల మొబైల్ సెంటర్ ల పేరుతో నూతన జాతీయ విద్యా విధానం అంగన్వాడి వ్యవస్థను నిర్వీర్యం చేయడానికి పూనుకున్నదని ,దీనివల్ల శిశు మరణాలు పెరిగి బాలింత మరణాలు పెరిగే అవకాశం ఉందని అన్నారు. ఇప్పటికైనా అంగన్వాడి సమస్యల పరిష్కారం కోసం బడ్జెట్లో వెంటనే నిధులు పెంచి వారి సమస్యలు పరిష్కరించాలని,లేదంటే సమ్మెను ఉధృతం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్ శ్రీనివాసులు, ఉపాధ్యక్షులు వర్ధన్ పర్వతాలు, జిల్లా సహాయ కార్యదర్శి పొదీల రామయ్య,జిల్లా కోశాధికారి గుంపల్లి అశోక్,అంగన్వాడీ టీచర్లు చంద్రకళ, ప్రభావతి, రజియా,సుచిత్ర తదితరులు పాల్గొన్నారు.


Similar News