మత్స్యకారుల ముందస్తు అరెస్టు..

మత్స్యకారుల సంక్షేమం కోసం నిధుల కేటాయింపు లేకపోవడానికి నిరసిస్తూ..

Update: 2025-03-21 04:20 GMT
మత్స్యకారుల ముందస్తు అరెస్టు..
  • whatsapp icon

దిశ,భూత్పూర్ : మత్స్యకారుల సంక్షేమం కోసం నిధుల కేటాయింపు లేకపోవడానికి నిరసిస్తూ.. శుక్రవారం అసెంబ్లీ ముట్టడికి మత్స్యకారుల రాష్ట్ర కమిటీ పిలుపునిచ్చిన నేపథ్యంలో శుక్రవారం భూత్పూర్ మండల పరిధిలోని పలువురు మత్స్యకారులను పోలీసులు ముందస్తు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా ఉమ్మడి పాలమూరు జిల్లా మత్స్యకారుల సంఘం మాజీ చైర్మన్ మనేమోని సత్యనారాయణ మాట్లాడుతూ మత్స్యకారుల సంక్షేమం కోసం ప్రభుత్వం నిధులను కేటాయించకపోవడం బాధాకరం అన్నారు.

గత ఏడాది కేటాయించిన నిధులలో ఇప్పటివరకు 50 శాతం నిధులను మాత్రమే ఖర్చు చేశారు. మత్స్యకారులను ఈ ప్రభుత్వం పూర్తిగా విస్మరిస్తోందని ఆయన పేర్కొన్నారు. ముదిరాజ్ లను బీసీ డీ నుండి ఏ లోకి చేర్చాలి అని.. ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపల వృత్తిని నమ్ముకుని జీవనం సాగిస్తున్న ముదిరాజులను విస్మరిస్తే రానున్న రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమం చేపడతామని సత్యనారాయణ హెచ్చరించారు. కార్యక్రమంలో మండల మత్స్యకార సంఘం నాయకులు ఎర్ర బాలప్ప, మేకల సత్యనారాయణ, బోల వెంకట రాములు, గొడుగు ఆంజనేయులు, గంగాపురం శ్రీనివాసులు, ఎంకంపల్లి మల్లేష్, గొడుగు వెంకట్ రాజు, గోనెల నాగరాజు,పట్నం శ్రీశైలం, అనుప ఆంజనేయులు,ఊశన్న తదితరులు ఉన్నారు.

Similar News