ఏఎస్ఐనని చెప్పి బంకు యజమానికి టోకరా.. రూ. 80వేలు కాజేసిన సైబర్ నేరగాడు

మండల కేంద్రంలోని ఓ బంకు యజమాని గోపి ఫోన్ కాల్ ను

Update: 2024-06-12 15:42 GMT

దిశ,ధరూరు : మండల కేంద్రంలోని ఓ బంకు యజమాని గోపి ఫోన్ కాల్ ను నమ్మి సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయిన ఘటన చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. జాంపల్లికి చెందిన బంకు యజమాని గోపికి ఈ నెల 6న సాయంత్రం ఓ ఫోన్ కాల్ వచ్చింది. అవతలి వ్యక్తి ధరూరు ఏఎస్ఐని అని.. తమ ఎస్ఐ కుమార్తె ఆరోగ్యం బాగో లేదని గోపీకి తెలిపాడు. ప్రస్తుతం ఆస్పత్రిలో ఉందని వివరించాడు. తాను క్యాష్ ఇస్తానని, తనకు రూ.80వేలు గూగుల్ పే చేయాలని గోపిని కోరాడు. కాగా గోపి తాను బంకులో లేనని.. తమ మేనేజర్ కు ఫోన్ చేయాలని చెప్పాడు. దీంతో సదరు మోసగాడు మేనేజర్ కు కాల్ చేసి రూ. 80వేలు గూగుల్ పే వేయించుకున్నాడు. కాగా డబ్బుల విషయమై పోలీసులను అడుగగా.. తామేమి అలాంటి కాల్ చేయలేదని చెప్పడం తో తాము సైబర్ నేరగాళ్ల చేతిలో మోసపోయమని బం కు నిర్వాహకులు గ్రహించారు. మంగళవారం ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విజయ్ కుమార్ తెలిపారు.


Similar News