గోపాల్పేట్ అమ్మ చెరువులో దర్శనమిచ్చిన మొసలి..

మండల కేంద్రంలో గ్రామానికి ఆనుకుని ఉన్న అమ్మ చెరువులో గత కొన్ని రోజుల నుంచి మొసలి సంచరిస్తుంది.

Update: 2024-10-24 14:39 GMT

దిశ, గోపాల్పేట్: మండల కేంద్రంలో గ్రామానికి ఆనుకుని ఉన్న అమ్మ చెరువులో గత కొన్ని రోజుల నుంచి మొసలి సంచరిస్తుంది. బాటసారులు అయిన పశువుల కాపరులకు కంటపడడంతో భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎక్కడ నోరులేని మూగజీవాలను చంపేస్తుందేమో అని భయాందోళనకు గురవుతున్నారు. కావున ఫారెస్ట్ అధికారులు తక్షణమే చర్యలు తీసుకొని ఆ మొసలిని సురక్షిత ప్రాంతానికి తరలించవలసిందిగా స్థానికులు కోరుతున్నారు.


Similar News