బ్యాంకు సేవలను సద్వినియోగం చేసుకోవాలి

నియోజకవర్గం కేంద్రంలో నూతనగా కెనరా బ్యాంక్ బ్రాంచ్ ను ఎమ్మెల్యే వాకిటి టి శ్రీహరి ప్రారంభించారు.

Update: 2024-11-08 14:46 GMT

దిశ, మక్తల్: నియోజకవర్గం కేంద్రంలో నూతనగా కెనరా బ్యాంక్ బ్రాంచ్ ను ఎమ్మెల్యే వాకిటి టి శ్రీహరి ప్రారంభించారు. బ్రాంచ్ నూతనంగా ప్రారంభించినందుకు సేవలో భాగంగా నిర్వాసిత గ్రామమైన కొత్త గార్లపల్లిలో ప్రజల సౌకర్యార్థం తాగునీటి ట్యాంకును నిర్మించాలనడంతో.. కెనరా బ్యాంక్ మేనేజర్ హామి ఇచ్చారు.రైతులకు అన్ని విధాలుగా పంట రుణాలను అందిస్తుందని వీటితోపాటు.. కమర్షియల్ సేవలకు రుణ సౌకర్యం ఉంటుందని వాటిని వినియోగించుకోవాలని,ముఖ్యంగా చదువుకున్న యువత స్వయం ఉపాధి కోసం కెనరా బ్యాంక్ తక్కువ వడ్డీతో రుణాలను మంజూరు చేస్తుందన్నారు. ఉపయోగకరమైన ఎన్నో రకాల సేవలను అందిస్తోందని,వ్యాపారస్తులు ,రైతులు ఈ సేవలను తప్పకుండా ఉపయోగించుకోవాలన్నారు. బ్యాంకు సేవలో భాగంగా కొత్త గార్లపల్లి గ్రామానికి దాదాపు లక్ష రూపాయల నిధులతో త్రాగునీటి కొరకు ట్యాంక్ ను కట్టించి.. కుళాయిలను ఏర్పాటు చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో మక్తల్ బ్రాంచ్ మేనేజర్ పి శశి భూషణ్, సీనియర్ బ్రాంచ్ మేనేజర్,చీఫ్ జనరల్ మేనేజర్, సర్కిల్ ఆఫీస్ బి చంద్ర శేఖర,డిప్యూటీ జనరల్ మేనేజర్,రీజనల్ ఆఫీస్-హైదరాబాద్ నార్త్ బాల కృష్ణ.డివిజనల్ మేనేజర్, రీజనల్చక్రధర్ పొనక, సి ఐచంద్రశేఖర్, మాజీ జెడ్పిటిసి లక్ష్మారెడ్డి మాజీ ఎంపీపీ చంద్రకాంత్ గౌడ్ కట్టా సురేష్ పార్టీల నాయకులు పాల్గొన్నారు.


Similar News