వర్షంలో సైతం 2కె రన్..
ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాలలో భాగంగా గద్వాల పట్టణంలో నిర్వహించిన 2k రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ప్రారంభించారు.
దిశ, గద్వాల టౌన్ : ప్రజాపాలన - ప్రజా విజయోత్సవాలలో భాగంగా గద్వాల పట్టణంలో నిర్వహించిన 2k రన్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ప్రారంభించారు. రాజీవ్ చౌక్ నుండి 2కె రన్ అంబేద్కర్ చౌక్ వరకు కొనసాగింది. ఈ 2k రన్ లో అధికారులతో పాటు వివిధ పాఠశాలలు, కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. తేలికపాటి వర్షంలో పాఠశాలల విద్యార్థులు ర్యాలీలో పాల్గొనడంతో అధికారుల తీరు పై పట్టణ ప్రజలు మండిపడుతున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల ర్యాలీలో మైనర్ లను (పాఠశాల విద్యార్థులు) పాల్గొనకూడదు. అధికారులు ఈజీ మెథడ్ కు అలవాటు పడి ప్రభుత్వ స్కూల్ పిల్లలను ర్యాలీలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి.