అక్రమ అరెస్టులు ఉద్యమాలను ఆపలేవు.. సీఐటీయూ..

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చివరి ఆయకట్టు వరకు నీరందించేలా వేసవిలో సాగునీటి కాలువలను దురస్తుకు చర్యలు చేపట్టాలని తూడి మేఘారెడ్డి కోరారు.

Update: 2025-03-22 09:29 GMT
అక్రమ అరెస్టులు ఉద్యమాలను ఆపలేవు.. సీఐటీయూ..
  • whatsapp icon

దిశ, మక్తల్ : సమస్యల పై ప్రభుత్వాని నిలదీసెందుకు ధర్నాలు ఆందోళనలకు సిద్ధమౌతుంటె ప్రభుత్వం కార్మిక నాయకులను అక్రమ అరెస్టులు చేస్తే ఉద్యమాలను ఆపలేవని. ముందస్తుగా అరెస్ట్ అయిన సీఐటీయూ జిల్లా సహాయ కార్యదర్శి గోవింద్ రాజ్, సీపీఎం మండల నాయకులు ఎల్లప్పను అన్నారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న కార్మికులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసి సంక్షేమ పథకాలను అమలు చేయాలని డిమాండ్ చేశారు.

కార్మిక వర్గ సమస్యలు పరిష్కరించకుండా కార్మిక నేతలను అరెస్టు చేయడం దారుణమన్నారు. శనివారం మక్తల్ మండలంలోని దాసరి దొడ్డి గ్రామంలో సీఐటీ సీపీఎం నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేయడం దుర్మార్గమైనా చర్య అని అరెస్టు చేసిన వారిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. కార్మిక నేతల అరెస్టు పైన ప్రభుత్వం దృష్టి పెట్టడం కన్నా కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు.


Similar News