రామాపురం కొండపై శ్రీవేంకటేశ్వర స్వామి బ్రహ్మో త్సవాలు
మండల పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలో తూర్పున నల్లమల అడవిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టా దశ (18వ) వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి
దిశ, కొల్లాపూర్ : మండల పరిధిలోని రామాపురం గ్రామ సమీపంలో తూర్పున నల్లమల అడవిలోని శ్రీ వేంకటేశ్వర స్వామి అష్టా దశ (18వ) వార్షికోత్సవం సందర్భంగా ఉత్సవాలు శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఆలయ అభిృద్ధి కమిటీ నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని ముస్తాబు చేశారు. ఈ కొండపై అతి పురాతన నీటి కోలను కూడా ఉంది. ఉదయం 9 గంటల నుంచి గణపతి పూజతో కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. 14వ తేదీ శనివారం ఉదయం 9 గంటలకు పూజలు,అభిషేకాలు, దీక్ష హోమం,ఉదయం 11-45 గంటలకు మహా మంగళహారతి, సాయంత్రం 5 గంటలకు ప్రాదోష పూజలు, దీక్ష హోమం తదితర పూజా కార్యక్రమాలు ఉంటాయి. 15వ తేదీ ఆదివారం ఉదయం 8గంటల నుంచి వివిధ పూజలు అనంతరం నీటి కోలనులో స్వామివారికి బ్రాహ్మణులు మంగళ వాయిద్యాలతో చక్రస్నానం చేయిస్తారు. ఆ తరువాత 11-30గంటలకు అలివేల్మంగా సామేత శ్రీ లక్ష్మి వెంకటేశ్వర స్వామి కల్యాణోత్సవం బ్రాహ్మణుల వేద మంత్రాలు మధ్య కన్నుల పండుగగా జరుగనుంది. స్వామివారి కళ్యాణోత్సవం కార్యక్రమానికి కొల్లాపూర్ నియోజక వర్గంలోని వివిధ గ్రామాల నుంచి ప్రజలు భారీ ఎత్తున తరలి రానున్నారు.