పడమటి ఆంజనేయ స్వామి తిరుణాలకు ఏర్పాట్లు పూర్తి

మక్తల్ పట్టణంలో కోలువై ఉన్న అతి పురాతన పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయి.

Update: 2024-12-12 14:56 GMT

దిశ, మక్తల్: మక్తల్ పట్టణంలో కోలువై ఉన్న అతి పురాతన పడమటి ఆంజనేయ స్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం ధ్వజారోహణతో ప్రారంభం కానున్నాయి. ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆలయ ధర్మకర్త ప్రాణేషాచారీ, ఈవో శ్యామసుందర్ చారీ తెలిపారు. 13న ఉదయం ఏడు గంటలకు ఉత్తరాది మఠం నుంచి స్వామి వారి ఉత్సవ విగ్రహాని పల్లకి ఉంచి పురవీధుల గుండా మేళ తాళాలతో దేవాలయం వరకు చేరుకుంటుంది. ఎనిమిది గంటలకు అంకురార్పణ, ధ్వజారోహణం, అలంకారోత్సవం నిర్వహి స్తారు. 8.30 గంటలకు హనుమాన్ వ్రతం, సాయంత్రం ఆరు గంటలకు గజవాహన సేవ ఉంటాయి. 14న ఉదయం 10 గంటలకు పవమాన హోమం, సాయం త్రం ఆరు గంటలకు నెమలి వాహన సేవ నిర్వహించనున్నారు. సాయంత్రం 6.30 గంటలకు ప్రభోత్సవం, 15న సాయంత్రం మూడు గంటలకు పల్లకీసేవ, ఆరు గంట లకు రథోత్సవం నిర్వహించనున్నారు. 16న సాయంత్రం హంస వాహన సేవ, ఆరు గంటలకు ఉత్సవం ఉంటుంది. 17న చక్రతీర్థ స్నానం, అశ్వవాహన సేవ, 18న సాయంత్రం ఆరు గంటలకు మహ మంగళహారతితో ముగుస్తుంది.


Similar News