ఘనంగా అయ్యప్ప మహాపడి పూజ
పట్టణ శివారులోని పెంట్లవెల్లి రోడ్డులోని సోమశిల హిల్స్ లో గుండ్రాతి కిరణ్ తేజ గౌడ్ గురు స్వామి నివాసంలో శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ గురువారం అంగరంగ వైభవంగా మంగళవాయిద్యాల మధ్య కోనసాగింది.
దిశ, కొల్లాపూర్: పట్టణ శివారులోని పెంట్లవెల్లి రోడ్డులోని సోమశిల హిల్స్ లో గుండ్రాతి కిరణ్ తేజ గౌడ్ గురు స్వామి నివాసంలో శ్రీనివాస్ గౌడ్ గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ గురువారం అంగరంగ వైభవంగా మంగళవాయిద్యాల మధ్య కోనసాగింది. ముందుగా గణపతి మెట్ల పూజలను జరిపించారు. భక్తి శ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజ తరువాత పంచామృతాభిషేకం,కుంకుమ,చందన పసుపు బస్మాభిషేకాలను చేశారు. మహా మంగళ హారతితో పూజా కార్యక్రమాలు ముగిశాయి. అయితే వివిధ ప్రాంతాల నుంచి భారీగా అయ్యప్ప మాలధారణ భక్తులు హాజరై అయ్య ప్ప స్వామికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు. అయితే ఈ సందర్భంగా కిరణ్ తేజగౌడ్ గురుస్వామిని రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ పగిడాల శ్రీనివాస్ రెడ్డి శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ ఇక్బాల్,సింగిల్ విండో మాజీ చైర్మన్ జూపల్లి రఘుపతి రావు,కౌన్సిలర్లు మేకల శిరీష యాదవ్,జ్యోతి శేఖర్, కాంగ్రెస్ నాయకులు వంగ రాజశేఖర్ గౌడ్,ఖాదర్ పాషా, వేణుగోపాల్ యాదవ్, సింగిల్ విండో డైరెక్టర్ పసుపుల నర్సింహ,యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బింగి మహేష్ యాదవ్, రామస్వామియాదవ్,కురుమ య్య ,గోపాల్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.