లేగ దూడకు డోలాహరణం.. హాజరైన బంధుమిత్రులు (వీడియో)
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/నాగర్ కర్నూల్: మూగ జీవుల పట్ల మమకారాన్ని చాటడం సహజమే.. కానీ...Special story about Kulakarni couple
దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్/నాగర్ కర్నూల్: మూగ జీవుల పట్ల మమకారాన్ని చాటడం సహజమే.. కానీ ఓ జంట మరో అడుగు ముందుకేసి పసి పిల్లలకు డోలాహరణం, నామకరణం చేసినట్లుగా తమ గోమాతకు పుట్టిన లేగదూడకు డోలహరణం చేసి నా మకరణం చేసి చర్చనీయాంశంగా మారారు.
వివరాలలోకి వెళితే నాగర్ కర్నూల్ జిల్లా ఎండబెట్ల గ్రామానికి చెందిన మోహన్ కులకర్ణి, సౌజన్య దంపతులు గోవుల పట్ల ఉన్న మమకారంతో రెండు సంవత్సరాల క్రితం ఓ గోవును కొని తెచ్చుకున్నారు. దానిని అల్లారు ముద్దుగా పెంచుతూ వచ్చారు. గత కొన్ని నెలల క్రితం ఆ గోమాత గర్భం దాల్చడంతో బంధుమిత్రులను ఆహ్వానించి గర్భిణీలకు జరిపినట్లుగా సీమంతం జరిపి వార్తల్లోకి ఎక్కారు. ఈ నెల 21న మగ దూడకు జన్మనిచ్చింది. ఆ దూడకు శుక్రవారం కులకర్ణి దంపతులు డోలాహరణం చేసి సురభి అని నామకరణం చేశారు. దానికి బంధుమిత్రులను ఆహ్వానించి వారి సమక్షంలో కార్యక్రమాన్ని కన్నుల పండుగ నిర్వహించారు. వేదమంత్రాలు... డోలహరణం సందర్భంగా ఆలపించే పాటలతో కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం అందరికీ భోజన సదుపాయాలను కల్పించి తమ ప్రత్యేకతను చాటుకున్నారు. మూగ జీవుల పట్ల కులకర్ణి దంపతులు చూపిన ఆప్యాయతల పట్ల పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు.