శంకర లింగేశ్వర స్వామి అగ్నిగుండ మహోత్సవం
శంకర లింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండంను వైభవంగా నిర్వహించారు.

దిశ, ఊట్కూర్ : శంకర లింగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా మంగళవారం తెల్లవారుజామున అగ్నిగుండంను వైభవంగా నిర్వహించారు. ఆలయ సాంప్రదాయ ప్రకారం పుణ్యస్నానాలు ఆచరించి తడిబట్టలతో అర్చకులు, పలువురు భక్తులు అగ్నిగుండం వద్దకు చేరుకొని.. పూజలు నిర్వహించి నిప్పురవ్వలపై నడిచి భక్తిని చాటుకున్నారు. నందికోలు ఆటలు జరిపారు. పురందరులు పడిన ఖడ్గలు భక్తులను ఆకట్టుకున్నాయి. దేవాలయానికి నలుమూలల భక్తులు తరలివచ్చారు. దీంతో ఆలయ ప్రాంగణం శివ నామస్మరణంతో మార్మోగింది. బ్రహ్మోత్సవాల సందర్భంగా స్వామివారి మూలవిరాట్ ప్రత్యేక అలంకరణ చేశారు. రాత్రి శివ నమస్కరణ తో భక్తులు ప్రభోత్సవంను లాగారు. స్వామి వారిని దర్శించుకున్న వారు భోగభాగ్యాలు కలుగుతాయని ప్రజల నమ్మకం.. ఎటువంటి ఆటంకాలు జరగకుండా కర్ణాటక పోలీసులు బందోబస్తు నిర్వహించారు.