కవితలు సమాజ హితానికి ఉపయోగపడాలి

కవితలు సమాజ హితానికి ఉపయోగపడాలని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు.

Update: 2025-03-21 14:31 GMT
కవితలు సమాజ హితానికి ఉపయోగపడాలి
  • whatsapp icon

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: కవితలు సమాజ హితానికి ఉపయోగపడాలని ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ రాజేంద్రప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్టీఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల 'ప్రపంచ కవితా దినోత్సవం' కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. విద్యార్థుల ఆలోచనలు అక్షర రూపాన కవితలుగా మారాలని సూచించారు. జడ్చర్ల డిగ్రీ కళాశాల తెలుగు,హిందీ ఆచార్యులు వెంకటయ్య,డా.కళ్యాణి నరసింహరావు లు మాట్లాడుతూ..రామాయణం,భాగవతంలోని కవితా సారాంశాలను,పదాలను,భాషా ప్రయోగాలను వివరిస్తూ,వాడుక పదాలతో కూడా కవిత్వం రాసే విధానాన్ని,హిందీలోని పద్య,గద్య,సాహిత్యం గురించి వివరించారు. అంతకుముందు నిర్వహించిన కవితా పోటీల్లో పాల్గొన్న లలిత కు(ప్రథమ),శ్రావణీ(ద్వితీయ),నందిని(తృతీయ)బహుమతులను బహుకరించారు. ఈ కార్యక్రమంలో డా.లక్ష్మినరసింహరావు,డా.మధుసూధనశర్మ,డా.ప్రవీణ్ కుమార్,డా.సునీత,హేమలత,ప్రభాకర్,శ్రీకృష్ణుడు,లింగమయ్య,వెంకట్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.


Similar News