ఏడుగురు ఎమ్మెల్యేలు, సీఎం చెమటోడ్చి ప్రచారం చేసిన నా గెలుపుని ఆపలే : డీకే అరుణ

ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కలిసి చెమటోడ్చి ప్రచారం చేసిన తన గెలుపు ను అడ్డు కోలేకపోయారని మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు.

Update: 2024-07-08 12:03 GMT

దిశ,మక్తల్ : ఉమ్మడి పాలమూరు జిల్లాలో ఏడుగురు ఎమ్మెల్యేలు, ముఖ్యమంత్రి కలిసి చెమటోడ్చి ప్రచారం చేసిన తన గెలుపు ను అడ్డు కోలేకపోయారని మహబూబ్నగర్ పార్లమెంటు సభ్యురాలు డీకే అరుణ అన్నారు. సోమవారం రోజు ఫంక్షన్ హాల్ ఏర్పాటు చేసిన కృతజ్ఞత సభకు ముఖ్య అతిథిగా డీకే అరుణ హాజరయ్యారు. అనంతరం మాట్లాడుతూ… బీఆర్ఎస్ పార్టీ వారు తన గెలుపుకు కృషి చేశారని వస్తున్న వార్తలో నిజం ఉందో లేదో తెలియదని, తన గెలుపు కోసం సహకరించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.

నియోజకవర్గ అభివృద్ధికి స్థానిక ఎమ్మెల్యే కలిసి వస్తే తన వంతుగా కృషి చేయడానికి రాజకీయాలను పక్కనపెట్టి సహకరిస్తానని, కక్షలు పెంచుకొని కార్యకర్తల పై సాధింపులు చేస్తే చూస్తూ ఊరుకోమని ఆమె అన్నారు. మహబూబ్నగర్ జిల్లాలో సాగునీటి ప్రాజెక్టులో పెండింగ్ పనులకు నిధులు మంజూరికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ప్రాజెక్టు కింద ముంపు గ్రామాల ప్రజలకు నష్టపరిహారం వచ్చేలా స్థానిక ఎమ్మెల్యే తో కలిసి పని చేస్తానని ఆమె అన్నారు.

తను ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తినని ఈ ప్రాంతం అభివృద్ధికి తను కట్టుబడి ఉంటానని, ఈ ప్రాంత అభివృద్ధి చెందితే దివంగత తన తండ్రి చిట్టెం నర్సిరెడ్డి ఆశయాన్ని నెరవేర్చిన దానిని అవుతానని ఆమె అన్నారు. తన గెలుపుకు కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ఎల్లవేళలా మీకు ఏ ఆపద వచ్చిన ఆదుకోవడానికి సిద్ధంగా ఉన్నానని, త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్తానాలను గెలుచుకొని ఆధిపత్యం చాటాలని డీకే అరుణ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బిజెపి కార్యకర్తలు కొండయ్య, జిల్లా అధ్యక్షుడు పడకుల శీను, భాస్కర్, కర్నిస్వామి, కల్లూరి నాగప్ప, రాజశేఖర్ రెడ్డి, మాజీ ఎంపిటిసి బలరాం రెడ్డి, లక్ష్మణ్, రఘు ప్రసన్న భట్, మల్లికార్జున్, దేవరింటి నరసింహారెడ్డి, నియోజకవర్గం లోని మండల అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు.


Similar News