సింగోటం శ్రీవారి సముద్రంలో ఐదు స్పీడ్ బోట్లు ఏర్పాటు
సింగోటంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలుప్రారంభం కానున్నాయి.
దిశ, కొల్లాపూర్: సింగోటంలో సంక్రాంతి పండుగ సందర్భంగా శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి బ్రహ్మోత్సవాలుప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా జాతరకు తరలివచ్చే భక్తుల ఆహ్లాదం కోసం శ్రీవారి సముద్రంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో.. ఐదు స్పీడ్ బోట్లు ఏర్పాటు చేయనున్నట్లు నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నర్సింహ తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా జనవరి 17వ తేదిన లక్ష్మి నరసింహ స్వామి రధోత్సవం సందర్భంగా మంత్రి జూపల్లి కృష్ణారావు ఆదేశాలతో..గురువారం నాగర్ కర్నూల్ జిల్లా పర్యాటక శాఖ అధికారి కల్వరాల నరసింహ సింగోటం దేవస్థానం అధికారి, జనుంపల్లి జైపాల్ రెడ్డితో కలిసి కలియ తిరిగారు.ఈ సందర్భంగా చెరువు నీటిలో ఏర్పాటు చేసిన జెట్టిని నరసింహ ఎక్కి పరిశీలించారు. పర్యాటకులు శ్రీవారి సముద్రంలో స్పీడ్ బోట్లలో విహారించేందుకు కావాల్సిన సదుపాయలపై వారు పర్యవేక్షించారు. జాతరకు వచ్చే పర్యాటకులకు అనుగుణంగా ఐదు స్పీడ్ బోట్లు ఏర్పాటు చేసే దిశగా మంత్రి జూపల్లి కృష్ణారావు దృష్టికి తీసుకెళ్లి ఏర్పాటు చేస్తామని,అదే విధంగా జాతరలో రాత్రి వేళల్లో భక్తులకు ఇబ్బందులు లేకుండా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేయాలని ఆయన దేవాదాయ శాఖ అధికారులను కోరారు. మంత్రి జూపల్లి సహకారంతో ఏర్పాట్లు చేస్తామని ఆయన దేవాదాయ శాఖ సిబ్బందికి సూచించారు.