దుకాణాల అద్దెలు చెల్లించకుంటే సీజ్ చేయండి: అదనపు కలెక్టర్ మయాంక్ మిత్తల్

నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఐడీఎస్ఎంటీ మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెలు చెల్లించకుంటే సీజ్ చేయాలని లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు.

Update: 2023-05-15 16:34 GMT

దిశ ప్రతినిధి, నారాయణపేట: నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఐడీఎస్ఎంటీ మున్సిపల్ కాంప్లెక్స్ దుకాణాల అద్దెలు చెల్లించకుంటే సీజ్ చేయాలని లోకల్ బాడీస్ అడిషనల్ కలెక్టర్ మయాంక్ మిత్తల్ మున్సిపల్ అధికారులను ఆదేశించారు. సోమవారం అడిషనల్ కలెక్టర్ నారాయణపేట మున్సిపాలిటీనీ ఆకస్మికంగా తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా డిజిటల్ డోర్ నెంబర్ ల గురించి అడిగి తెలుసుకున్నారు.

మున్సిపల్ కార్యాలయంలోని ఆయా విభాగాలను అడిషనల్ కలెక్టర్ పరిశీలించారు. అలాగే నారాయణపేట మండలం కొల్లంపల్లి గ్రామాన్ని అడిషనల్ కలెక్టర్ సందర్శించి సీఎం కప్ కార్యక్రమంలో భాగంగా క్రీడాకారులను పరిచయం చేసుకొని రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించాలన్నారు. కార్యక్రమంలో ఎంపీపీ అమ్మకోళ్ల శ్రీనివాస్ రెడ్డి, కొల్లంపల్లి సర్పంచ్ సాయి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News