ప్రైవేట్ హాస్పిటల్‌లో నిబంధనలు భేఖాతర్
ప్రైవేట్ హాస్పిటల్ వ్యర్థాలను యధేచ్చగా ఎక్కడ పడితే అక్కడ పడేసి యజమానులు చేతులు దులుపుకుంటున్నారు.
దిశ, గద్వాల టౌన్ : ప్రైవేట్ హాస్పిటల్ వ్యర్థాలను యధేచ్చగా ఎక్కడ పడితే అక్కడ పడేసి యజమానులు చేతులు దులుపుకుంటున్నారు. బయో మెడికల్ వేస్ట్ మేనేజ్‌మెంట్ నిర్వహణ పక్కగా చేపట్టాల్సిన ఆసుపత్రి యాజమాన్యం నిర్లక్ష్య ధోరణితో..ప్రధాన రహదారి పక్కనే పారేస్తున్నారు. గద్వాల పట్టణంలోని కృష్ణవేణి చౌరస్తాలో శక్తి మదర్ చిల్డ్రన్ హాస్పిటల్ లో వినియోగించిన సూదులు, సెలైన్,కాటన్, తదితర వ్యర్థాలను రోడ్డు పక్కన కుప్పలు కుప్పలుగా పడేస్తున్నారు. ఎప్పటికప్పుడు డస్ట్ బిన్ లో నింపి..వాహనాల్లో తరలించాల్సి ఉంటుంది. అలా కాకుండా విచక్షణారహితంగా ఎక్కడ పడితే అక్కడ పడేస్తున్నారు. రోడ్డు పక్కన అనేక మంది నడుస్తుంటారని, వాటిని తొక్కితే ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని ప్రజలు విమర్శిస్తున్నారు. సంబంధిత ఆరోగ్య శాఖ అధికారులు ప్రైవేట్ హాస్పిటల్స్ నిబంధనలను పాటించకుండా యధేచ్చగా వ్యవహరిస్తున్న పట్టించుకోవడంలేదన్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు తగు చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.