గురుకులాలను రాజకీయం చేయడం సరికాదు : హర్షవర్ధన్ రెడ్డి

గురుకులాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాలు చేయడం

Update: 2024-12-02 11:42 GMT

దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: గురుకులాలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ రాజకీయాలు చేయడం సరికాదని టీపీసీసీ అధికార ప్రతినిధి హర్షవర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కేసీఆర్ హయాంలో గురుకుల సెక్రటరీగా పనిచేసిన మీరు నియంతలా ఎలా వ్యవహరించారో అందరికీ తెలుసునని,ఉపాధ్యాయును మీరు ఎంతగా వేధించారో ఎవరిని అడిగిన చెబుతారని ఆయన ఆరోపించారు. మీ హయాంలో కొన్ని వందల సార్లు పురుగుల భోజనం పెట్టడం,కనీసం స్నానం చేయడానికి సబ్బులు కూడా ఇవ్వలేని ఉదంతాలు ఎన్నో సార్లు బయటి రాలేదా అని ప్రశ్నించారు.

ఇప్పుడు మీరు ప్రభుత్వంపై విమర్శలు చేస్తుండడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. గురుకులాల్లో దాదాపు 15 వేల మందికి పదోన్నతులు,11 వేల మందిని ప్రభుత్వం నియామకం చేసింది..మీకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం 10 నెలల్లోనే 30 శాతం మెస్ చార్జీలు పెంచడం,పాఠశాలలు తెరిచే నాటికి పిల్లలకు పుస్తకాలు,యూనిఫాంలు ఇచ్చి మెరుగైన భోజన అందిస్తుంటే ఓర్వలేకనే మీరు రాజకీయాలు చేస్తున్నారని ఆయన ఆరోపించారు. ఈ సమావేశంలో డీసీసీ మీడియా సెల్ కన్వీనర్ సీజె బెనహర్,లక్ష్మణ్ పాల్గొన్నారు.


Similar News