ప్రజల అభీష్టం మేరకు ప్రజాపాలన నందిస్తున్నాం.. డాక్టర్ జిల్లెల చెన్నారెడ్డి

తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అభీష్టం మేరకే ప్రజాపాలన కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చెన్నారెడ్డి అన్నారు.

Update: 2024-12-02 08:12 GMT

దిశ, వనపర్తి : తెలంగాణ రాష్ట్రంలో ప్రజల అభీష్టం మేరకే ప్రజాపాలన కొనసాగుతుందని తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చెన్నారెడ్డి అన్నారు. సోమవారం ఉదయం తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ జిల్లెల చెన్నారెడ్డి, జిల్లా కలెక్టర్ ఆదర్శ సురభి, అదనపు కలెక్టర్ సంచిత గంగువార్ లతో కలిసి టూ కే రన్ ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎన్నుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలో ప్రజారంజక, ప్రజాపాలన నందిస్తున్నామన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం వసంతం పూర్తి చేసుకోనున్న శుభ తరుణంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ రెండవ తేదీ నుండి తొమ్మిదవ తేదీ వరకు ప్రజాపాలన ప్రజా విజయోత్సవాలను నిర్వహిస్తుందని తెలిపారు. ఇందులో భాగంగా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో విద్యార్థులు, యువతి, యువకులు, క్రీడాకారులతో ప్రభుత్వ శాఖల అధికారులతో 2కే రన్ చేపట్టామన్నారు. ప్రజా విజయోత్సవాలలో రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాల పై ప్రజలలో అవగాహనకల్పించనున్నామన్నారు.

ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన ఆరు గ్యారెంటీలను కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగానెరవేరుస్తూముందుకెళ్తుందన్నారు. భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇదే పరంపర కొనసాగాలని అకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంధాలయం చైర్మెన్ గోవర్ధన్, ఆర్డీఓ సుబ్రహ్మణ్యం, యువజన, క్రీడల శాఖ జిల్లా అధికారిసుధీర్ రెడ్డి, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ సెక్రెటరీ సురేందర్ రెడ్డి, డీఎస్పీ వెంకటేశ్వర్ రావు, మున్సిపల్ కమీషనర్ పూర్ణ చందర్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ బి కృష్ణ, కౌన్సిలర్ బ్రహం చారి, కాంగ్రెస్ పార్టీ పట్టణ కార్యదర్శి ఎండి బాబా, పెద్ద మందడి కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు పెంటన్న యాదవ్, కాంగ్రెస్ నాయకులు, విద్యార్థులు, క్రీడాకారులు, యువతి యువకులు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Similar News