రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం : ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి

రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి

Update: 2024-12-02 15:11 GMT

దిశ, జడ్చర్ల : రైతు సంక్షేమానికి కాంగ్రెస్ పెద్దపీట వేస్తుందని జడ్చర్ల ఎమ్మెల్యే జనం పల్లి అనిరుద్ రెడ్డి అన్నారు. సోమవారం ఉమ్మడి బాలానగర్ మండల వ్యవసాయ మార్కెట్ కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డి ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గుమ్మళ్ళ అశ్విని రాజేశ్వర్ రెడ్డి , వైస్ చైర్మన్ గా శేఖర్ గౌడ్, 10 మంది డైరెక్టర్లు చేత అధికారులు ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి నూతన చైర్మన్ వైస్ చైర్మన్ తో పాటు..పాలకవర్గాన్ని పూలమాలలు వేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ..తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం రైతాంగానికి పెద్దపీట వేస్తుందని అన్నారు. గత పది సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతులకు చేసిన రుణమాఫీ వారి మిత్తిలకే సరిపోయిందని అన్నారు.

కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రుణమాఫీ చేసిందని గుర్తు చేశారు. అంతేకాకుండా యాసంగిలో పండించిన ప్రతి రైతు గింజను కొంటూ వారం రోజుల్లోనే వారి ఖాతాలో రాష్ట్ర ప్రభుత్వం డబ్బులను జమ చేస్తుందని అన్నారు. ఇప్పటి వరకు జడ్చర్ల నియోజవర్గానికి రోడ్ల అభివృద్ధి కోసం 153 కోట్ల నిధులు మంజూరు చేయించానని అన్నారు. గత బీఆర్ఎస్ హాయంలో చేసిన రోడ్ల అభివృద్ధి శంకుస్థాపనలకే పరిమితమైపోయిందని విమర్శించారు. జడ్చర్ల నియోజకవర్గానికి రోడ్ల నిమిత్తం మరిన్ని నిధులు తీసుకొచ్చి..ఎక్కడ కూడా రోడ్ల ఇబ్బందులు లేకుండా సస్యశ్యామలం చేస్తానని అన్నారు. నూతనంగా ఏర్పడిన బాలనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ రైతుల సమస్యలు తీర్చడానికి, రైతు సంక్షేమానికి కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ అధికారులు కాంగ్రెస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.


Similar News