అక్కడ అంతు దొరకక.. అంతం కావడం లేదు..
ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిన ఆ ఏడుగురి మృతదేహాల కోసం జరుగుతున్న సహాయక చర్యలు మంగళవారం నాటికి 25 రోజుకు చేరుకున్నారు.

దిశ, అచ్చంపేట : ఎస్ఎల్బీసీ సొరంగంలో మిగిలిన ఆ ఏడుగురి మృతదేహాల కోసం జరుగుతున్న సహాయక చర్యలు మంగళవారం నాటికి 25 రోజుకు చేరుకున్నారు. దాదాపు 18 రెస్క్యూ దేశంలోని అత్యున్నత బృందాలు నిర్విరామంగా శ్రమిస్తున్నప్పటికీ సొరంగంలో ఎదురవుతున్న అనేక సాంకేతిక ఇబ్బందులు, ముందుకు వెళ్లలేని విధంగా సింగరేణి, దక్షిణ మధ్య రైల్వే, ర్యాట్ హోల్ మైనర్స్, SDRF, NDRF, ఆర్మీ, తదితర బృందాలు సుమారు 500 మంది రౌండ్ ది క్లాత్ మాదిరిగా మూడు శక్తుల ద్వారా సహాయక చర్యలు కొనసాగిస్తున్న నేపథ్యంలో సొరంగంలో 13.5 కిలోమీటర్లు నుండి పూర్తిగా ప్రతికూల పరిస్థితులు రెస్క్యూ బృందాలకు ఎదురవుతున్న నేపథ్యంలో సత్ఫలితాలు కనిపించడం లేదు. అలాగే సొరంగం నుండి నీటి ఊట వేగంగా వస్తుండడం తద్వారా ఆ ఏడు గురి ఆచూకీ అంతు దొరకక.. రెస్క్యూ ఆపరేషన్ అంతం కావడం లేదు.
రోబో పనులకు నెట్వర్క్ సమస్య...
రోబోల ద్వారా సహాయక చర్యలు మరింత వేగవంతం అవుతాయని అధికార యంత్రాంగం ఆశించినప్పటికీ.. రోబోలా పనులకు సొరంగంలో సిగ్నల్ సమస్య పూర్తిగా అడ్డంకిగా మారుతున్నట్లు సమాచారం. ఆ సిగ్నల్ వ్యవస్థను మెరుగు పరిశీలనందుకు అన్వి రోబో సంస్థ ఇతర టెక్నికల్ వారు ప్రయత్నాలు చేస్తూనే ఉన్నారు. అలాగే కేరళకు చెందిన క్యాడవర్ డాగ్స్ సేవలను నిపుణులు వాడుతున్నారు. దక్షిణ మధ్య రైల్వే కార్మికులు ప్లాస్మా కట్టర్ ద్వారా టీబీటీ మిషన్ శిఖరాలను కట్ చేస్తూ బయటికి పంపిస్తున్నారు.
ఆ ప్రదేశంలో 3 వందల మీటర్లకు పైగా..
ఎస్ఎల్బీసీ సొరంగంలోని 13.5 కిలోమీటర్ల నుండి తదుపరి ప్రమాదం జరిగిన స్థలం వరకు దాదాపు 300 మీటర్లకు పైగా పెద్ద ఎత్తున మట్టి దిబ్బలు, బండరాళ్లు పేరుకుపోయి గట్టిగా బిగిస్కుపోయి ఉన్న నేపథ్యం, రెస్క్యూ బృందాలు తవ్విన కాస్త మట్టిని లోకో ట్రైన్ ద్వారా మాత్రమే బయటికి తరలించడం, కన్వేయర్ బెల్ట్ పని చేసినట్టు చేస్తూ నిలిచిపోవడంతో మట్టిని వేగంగా బయటికి తీసే ప్రక్రియకు అడ్డంకులు ఎదురు పడుతున్నాయి. అయినప్పటికీ కలెక్టర్ బాధావత్ సంతోష్ ఎస్ఎల్పీసీ వద్దనే ఉంటూ రెస్క్యూ బృందాల ఉన్నతాధికారులతో ఎప్పటి కప్పుడు సూచనలు మార్పులు చేస్తూ సహాయక చర్యలను పరివేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం సహాయక చర్యల కోసం బృందాలు సొరంగంలోకి వెళ్లాయి.