Collector Sikta Patnaik : నాణ్యమైన వైద్య సేవలు అందించాలి
ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని
దిశ, నారాయణపేట క్రైమ్: ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం ఉదయం జిల్లా ఆసుపత్రి నీ ఆకస్మిక తనిఖీ చేసి కలెక్టర్ మాట్లాడుతూ డ్యూటీ లో డాక్టర్ సమయానికి చేరుకొని రోగులకు వైద్య సేవలు అందించాలన్నారు. జిల్లా కలెక్టర్ ఆసుపత్రి లోని వార్డులను పరిశీలించి అక్కడున్న రోగులతో మాట్లాడి వైద్యులు అందిస్తున్న సేవల పై ఆరా తీశారు. రోగులకు అందిస్తున్న డైట్ సమయానికి చేరుతుందా లేదా ఇవాళ ఉదయం రోగులకు అల్పాహారం అందించారా? లేదా అనే విషయాలు తెలుసుకున్నారు. అక్కడున్న ఓ పాపను ఆప్యాయంగా పలకరించారు.
రోజు వారి ఓ. పి.ఏంత ఉందన్నవిషయాన్ని డాక్టర్ ల ద్వారా తెలుసుకున్నారు. అలాగే రక్త నిల్వ కేంద్రాన్ని పరిశీలించి వివరాలు కనుక్కున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వారు వివరిస్తూ ఆగస్టు 1వ తేదీ నుండి ఇప్పటివరకు 263 వైరల్ ఫీవర్ కేసులు నమోదు అయ్యాయని, డెంగ్యూ కేసులు 8 నమోదు అయి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారన్నారు. అలాగే జిల్లా కేంద్రంలోని బస్టాండ్ ఎదురుగా ఉన్న ఈవీఎం గోదామును కలెక్టర్ పరిశీలించి పటిష్ట బందోబస్తు ఉండాలన్నారు. అంతకుముందుగా సోమవారం ప్రజావాణి సందర్భంగా కలెక్టరేట్ లో ఫిర్యాదు దారుల నుంచి కలెక్టర్ వినతులను స్వీకరించి ఫిర్యాదులను పెండింగ్లో ఉంచరాదని ఆయా శాఖల అధికారులకు ఆదేశించారు.