న్యాయం చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముందు అర్ధనగ్నంగా నిరసన

తనకు న్యాయం చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముందు

Update: 2024-08-20 12:53 GMT

దిశ,దేవరకద్ర: తనకు న్యాయం చేయాలని తహసిల్దార్ కార్యాలయం ముందు భూ బాధితుడు అర్ధ నగ్నంగా నిరసన చేసిన సంఘటన దేవరకద్ర మండల కేంద్రంలో చోటు చేసుకుంది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం గూర కొండ గ్రామానికి చెందిన బాధితుడు దాసరి శ్రీను మీడియా తో మాట్లాడుతూ నా తండ్రి అయిన దాసరి దాసన్నకు మేము ఐదుగురు కుమారులం ఒక కూతురు ఉన్నామన్నారు. అయితే తన తండ్రి చెవిటివాడని పెన్షన్ ఇప్పిస్తామని తహసిల్దార్ కార్యాలయానికి తీసుకువచ్చి సర్వే నంబర్ 194, 195, 196 ,199 లో వారసత్వంగా వచ్చిన మూడున్నర ఎకరాల భూమిని దాసన్న చిన్న కుమారుడు రాములు, ఆయన భార్య పేరు మీదుగా అక్రమంగా మాకు తెలియకుండా రిజిస్ట్రేషన్ చేసుకున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు.

రిజిస్ట్రేషన్ చేసే సమయంలో బాధితుడు మేము 5 మంది కుమారులము, ఒక కుమార్తె ఉన్నాము అని వారసత్వంగా వచ్చిన భూమిని ఒక్కరికే ఎలా చేస్తారు రిజిస్ట్రేషన్ ఆపండి పది నిమిషాల్లో అక్కడికి వస్తానని చెప్పిన కూడా రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు .మాకు భూమి లేకుంటే మేము బతికేది ఎలా , నా భూమి నాకు ఇవ్వకుంటే తహసీల్దార్ పేరు మీద కాగితం రాసి చచ్చిపోతా అని ఆవేదన వ్యక్తం చేశాడు. దేవరకద్ర తహసీల్దార్ శ్రీనివాసులును వివరణ అడగగా ఆయన మాట్లాడుతూ స్లాట్ బుక్ చేసి పట్టాదారే రిజిస్ట్రేషన్ చేశాడని , తప్పు జరిగినట్లయితే విచారణ చేసి సవరణ చేసి బాధితుడికి న్యాయం చేస్తామని తెలిపారు.


Similar News