పోలీసుల అదుపులో ఇసుక వ్యాపారి.. ఇంతకీ ఎవరతను..

ఇసుక వ్యాపారం చేస్తున్నారు అన్న ఫిర్యాదులు రావడంతో సోమవారం ఉదయం భూత్పూర్ పోలీసులు నల్లగుట్ట తండాకు చెందిన జేసీబీ శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు.

Update: 2025-03-17 16:37 GMT
పోలీసుల అదుపులో ఇసుక వ్యాపారి.. ఇంతకీ ఎవరతను..
  • whatsapp icon

దిశ, భూత్పూర్ : ఇసుక వ్యాపారం చేస్తున్నారు అన్న ఫిర్యాదులు రావడంతో సోమవారం ఉదయం భూత్పూర్ పోలీసులు నల్లగుట్ట తండాకు చెందిన జేసీబీ శ్రీను అనే వ్యక్తిని అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో తండావాసులు అడ్డగించారు. ఆటంకాలను అధిగమించి పోలీసులు జేసీబీ శ్రీనును స్టేషన్ కు తరలించారు. తాండా వాసి, మాజీ కౌన్సిలర్ బాలకోటితో కలిసి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్థానిక బీఆర్ఎస్ నాయకులు సైతం స్టేషన్ కి వెళ్లి పోలీసులతో మాట్లాడే ప్రయత్నాలు చేశారు.

ఈ క్రమంలో మాజీ కౌన్సిలర్ బాలకోటి శ్రీనును ఎందుకు కొట్టారు అంటూ పోలీసులతో వాదనకు దిగడంతో గందరగోళం నెలకొంది. దీంతో పోలీసులు ఐదుగురి పై కేసు నమోదు చేసినట్లు సమాచారం. తమ విధులకు ఆటంకం కల్పించాడు అన్న ఆరోపణలతో బాలకోటి పైన, అతడిని బయటకు పంపించాడు అన్న ఆరోపణల పై మరో మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ రెడ్డి పైన పోలీసులు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు సమాచారం. కాగా ఇసుక వ్యాపారం చేస్తున్న శ్రీను, మరో ఇద్దరి పై కూడా కేసులు నమోదైనట్లు తెలుస్తోంది. ఈ విషయం పై భూత్పూర్ ఎస్సై చంద్రశేఖర్ ను వివరణ కోరగా.. అక్రమ ఇసుక వ్యాపారం చేస్తున్న వారితో పాటు.. న్యూసెన్స్ చేసిన కొందరి పై కేసులు నమోదు చేశారని తెలిపారు.


Similar News