‘అనుమతులు కొంత.. తవ్వకాలు చెరువంత’..కబ్జా కోరల్లో శిఖం భూములు

భూగర్భ జలాల పెంపునకు దోహదం చేయడంతోపాటు, పంటలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో తవ్వించిన చెరువులను ఆక్రమించి కొంతమంది యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు.

Update: 2024-09-26 03:41 GMT

గ్రామాల్లో భూగర్భ జలాల పెంపునకు దోహదం చేసే చెరువులను కొంతమంది యథేచ్ఛగా ఆక్రమిస్తున్నారు. రోజురోజుకు కబ్జా చేస్తూ అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. తొర్రూరు మండలంలో చుట్టూ ఉన్న గొలుసుకట్టు చెరువుల భూములు ఆక్రమణలతో విస్తీర్ణం తగ్గిపోతున్నాయని మండల ప్రజలు వాపోతున్నారు. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పడిపోయి అస్తిత్వాన్ని కోల్పోతున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువులను ఆనుకుని భూములు ఉన్న వ్యక్తులు కొద్దికొద్దిగా జరుపుతూ శిఖం కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా నామమాత్రంగా విచారణ జరిపి 'మామూలు'గా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కాంటయపాలెం గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువు కొంత శిఖం భూమిని చెరువును అనుకుని ఉన్న ‘కేజీఎన్’ క్వారీ యాజమానులు కబ్జా చేస్తున్నారు. అదేవిధంగా చెరువు మధ్యలో గ్రానైట్ బండలు, మొరం నింపుతూ భారీ వాహనాలు వెళ్లడానికి పెద్ద బాట ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాంటయపాలెం పెద్ద చెరువును కబ్జాకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

దిశ, తొర్రూరు : భూగర్భ జలాల పెంపునకు దోహదం చేయడంతోపాటు, పంటలకు సాగునీరు అందించాలన్న ఉద్దేశంతో తవ్వించిన చెరువులను ఆక్రమించి కొంతమంది యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారు. మండలంలో చుట్టూ ఉన్న ఈ గొలుసుకట్టు చెరువు భూములు ఆక్రమణలతో విస్తీర్ణం తగ్గిపోతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో నీటి నిల్వ సామర్థ్యం పడిపోయి అస్తిత్వాన్ని కోల్పోతున్నాయని రైతులు వాపోతున్నారు. చెరువులను ఆనుకుని భూములు ఉన్న వ్యక్తులు కొద్దికొద్దిగా జరుపుతూ శిఖం కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపణలు లేకపోలేదు. ఆక్రమణలకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు రెవెన్యూ, నీటి పారుదల శాఖ అధికారులకు ఫిర్యాదులు చేస్తున్నా నామమాత్రంగా విచారణ జరిపి 'మామూలు'గా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.

ఇటీవల మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని కాంటయపాలెం గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువు కొంత శిఖం భూమిని, చెరువును అనుకుని ఉన్న ‘కేజీఎన్’ క్వారీ యజమానులు, తమ ఆధీనంలోకి తీసుకున్నారని, అదే విధంగా చెరువు మధ్యలో గ్రానైట్ బండలు, మొరం నింపుతూ భారీ వాహనాలు వెళ్లడానికి పెద్దబాట ఏర్పాటుకు ఆక్రమిస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. చెరువును అనుకొని ఉన్న ‘కెజీఎన్’ క్వారీ నుంచి ఎక్కువ శాతం గ్రానైట్ బండలు (ఎఫ్టీఎల్) చెరువులో పడుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి కాంటయపాలెం పెద్ద చెరువును కబ్జాకు గురి కాకుండా తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

ఐదు నుంచి పది ఎకరాల ఆక్రమణ..

తొర్రూరు మండలంలోని కాంటాయపాలెం గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువు సర్వే నెంబర్ 87 లో చెరువు లోపల 368 ఎకరం 28 గుంటలు, మొత్తం పారకం 434 ఎకరాల 38 గుంటలు ఉంది. కాగా, ఆ చెరువును కేజీఎన్ క్వారీ యాజమాన్యం సుమారుగా 5 నుంచి 10 ఎకరాలు ఆక్రమించి అక్రమంగా బాట వేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అదేవిధంగా చెరువు వెనుక భాగం నుంచి అమ్మాపురం వెళ్ళడానికి ఒక కాలినడక బాటను కూడా గతంలో ఏర్పాటు చేయడం జరిగింది. కానీ అది కూడా కేజీఎన్ క్వారీ యాజమాన్యం ఆక్రమించి అటువైపు పంట పొలాలకు ఎడ్లబండ్లు వెళ్లకుండా ఆక్రమించుకున్నారని రైతులు వాపోతున్నారు. ఇప్పటికైనా సంబంధిత రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులు స్పందించి వెంటనే ఆ బాటను తొలగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.

క్వారీ యాజమాన్యం ఇష్టారాజ్యం..

కాంటాయపాలెం చెరువులో బాట నిర్మించి కేజీఎన్ క్వారీ యాజమాన్యం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. కేజీఎన్ క్వారీ పర్మిషన్ సర్వే నెంబర్ 87/1 లో రెండు హెక్టార్లు భూమిలో క్వారీ పనులు చేపట్టుకోవాలి. కానీ క్వారీ యజమాన్యం అక్రమంగా 87 సర్వే నంబర్‌లో ఉన్న చెరువు శిఖం భూములలో చెరువు మధ్యలో నుంచి అక్రమ బాటను నిర్మించారు. అదేవిధంగా క్వారీలోని గ్రానైట్ రాళ్లు కూడా చెరువులో పడుతున్నాయి. దీంతో చెరువు విస్తీర్ణం తగ్గి భూగర్భ జలాలు తగ్గుతున్నాయని స్థానికులు వాపోతున్నారు. కేజీఎన్ క్వారీ యాజమాన్యం సుమారుగా 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు అక్రమ చెరువును ఆక్రమించారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ప్రభుత్వ భూములను కాపాడాలని రైతులు వేడుకుంటున్నారు.

బాట అక్రమమే..

క్వారీ నిర్వాహకులకు ఎటువంటి అనుమతులు లేకుండా చీకటి యాకమ్మ చెలుకల నుంచి అక్రమంగా బాట నిర్మించారు. అదేవిధంగా ఆ బాట అమ్మపురం వెళ్లడానికి అనుకూలంగా ఉండేది. ఇప్పుడు క్వారీ యాజమాన్యం అక్రమంగా ఆక్రమించి ఆ బాటను కూడా కనుమరుగు చేస్తున్నారు. మొత్తానికి కేజీఎన్ క్వారీ యాజమాన్యం నిర్మించిన అక్రమ బాట నిజమని స్థానిక ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

కఠిన చర్యలు తీసుకుంటాం..

కాంటయపాలెం గ్రామ శివారులో ఉన్న పెద్ద చెరువులో కేజీఎన్ క్వారీ యాజమాన్యం అక్రమంగా చెరువు మధ్యలో నుంచి బాట వేశారని మా దృష్టికి వచ్చింది. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి కేజీఎన్ క్వారీ నిర్వాహకులకు ఎటువంటి అనుమతులు ఇవ్వలేదు. కావున కేజీఎన్ క్వారీ పై విచారణ చేసి ఆ బాటను తొలగిస్తాం. ఆ బాటను నిర్మించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం అన్నారు.


Similar News