ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు, పార్టీలు సహకరించాలి - కలెక్టర్ శ్రీహర్ష

జిల్లా పరిధిలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని,సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు.

Update: 2023-10-16 14:34 GMT

దిశ, నారాయణపేట ప్రతినిధి: జిల్లా పరిధిలో అసెంబ్లీ ఎన్నికలు సజావుగా జరిగేందుకు ప్రజలు రాజకీయ పార్టీల నాయకులు సహకరించాలని, సోషల్ మీడియాలో ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీహర్ష హెచ్చరించారు. సోమవారం కలెక్టర్ విలేకరులతో మాట్లాడుతూ జిల్లాలో12 ఫ్లయింగ్ స్క్వాడ్ టీంలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఇప్పటివరకు రూ.20 లక్షలు సీజ్ చేసినట్లు తెలిపారు.సరైన వివరాలు గ్రీవెన్స్ MCC VIOLATE కమిటీకి  ఆధారాలను సమర్పింస్తే  డబ్బులను విడుదల చేయడం జరుగుతుందన్నారు.

మిగతా వాటిని ట్రెజరీలో డిపాజిట్ చేయడం జరుగుతుందన్నారు. ఇల్లీగల్ బెల్ట్ షాపుల ద్వారా నడిపే 150 షాపులను మూయించినట్లు తెలిపారు.ప్రతిరోజు మద్యం షాపులను తనిఖీ చేసి రోజు వారి నివేదిక తీసుకోవడం జరుగుతుందన్నారు. బ్యాంకుల్లో 10 లక్షల కంటే ఎక్కువ లావాదేవీలు జరిగితే పరిశీలిస్తున్నట్లు తెలిపారు.లైసెన్సులు 96 తుపాకులను డిపాజిట్ చేసుకున్నట్లు తెలిపారు. జిల్లా కంట్రోల్ రూమ్ కు 26 కేసులు ఔటర్ నమోదు కంప్లైంట్ లు వచ్చినవని, సి విజిల్ రెండు కంప్లైంట్లు వచ్చాయని తెలిపారు. పార్టీ నిర్వహణ వాహనాలకు అనుమతి, ర్యాలీల కొరకు సువిధ పోర్టల్ ద్వారా పార్టీ ప్రతినిధులు అప్లై చేసుకుంటే వెంటనే పరిశిలించి అనుమతులు మంజూరు చేస్తామని తెలిపారు.

ఈవీఎంలు భద్రపరుచుటకై కలెక్టర్ పరిశీలన

శాసనసభ ఎన్నికల నేపథ్యం లో EVM యంత్రాలను తరలించుటకు, ఎన్నిక అనంతరం EVMలను భద్ర పర్చుట, కౌంటింగ్ కు గానూ జిల్లా కేంద్రం సమీపాన శ్రీ దత్త బృందావన్ బిఏడ్ కళాశాలను జిల్లా కలెక్టర్ కోయ శ్రీ హర్ష అధికారులతో కలిసి సోమవారం మధ్యాహ్నం పరిశీలించారు. కళాశాలను పరిశీలించి పటిష్ట భద్రత కై కావలసిన సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. అదనపు కలెక్టర్ అశోక్ కుమార్, ఆర్డీవో రామచందర్ రావు తదితరులు ఉన్నారు.

Tags:    

Similar News