నాగర్ కర్నూల్ మున్సిపల్ సర్వసభ్య సమావేశం రసాభాస..ఎందుకంటే..?

నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం రసాబసాగా మారింది.

Update: 2025-01-03 10:25 GMT

దిశ, నాగర్ కర్నూల్ : నాగర్ కర్నూల్ మున్సిపాలిటీలో సర్వసభ్య సమావేశం రసాబసాగా మారింది. ప్రజా సమస్యలను పక్కనపెట్టి నిధులు, వాటాలలు, నిందలపైనే అధికార, విపక్ష పార్టీ నేతలు గొడవ పడ్డారు. తాగునీరు, చెత్త సేకరణ, రోడ్లు, వీధిలైట్లు తదితర అభివృద్ధి పనులు, ప్రజా సమస్యలను ఎజెండా అంశాల్లో చేర్చి చర్చించాల్సింది పోయి కేవలం ఆయా వార్డుల్లో పార్టీల వారీగా కౌన్సిలర్ల వారీగా ఖర్చు చేసుకున్న నిధుల అంశాలపై ఒకరికొకరు నిందలు వేసుకుంటూ తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో సర్వసభ్య సమావేశంలో గందరగోల వాతావరణం నెలకొంది. సుమారు 2.70 కోట్ల మిగులు నిధుల్లో వైకుంఠ రథం, రెండు ట్రాక్టర్లు, పది ఆటోల కొనుగోలు, నిధుల వాటాలు పంపకాల కొరకు కూడా టేబుల్ ఎజెండా కింద ప్రతిపాదన పెట్టి వాటాలు పంచుకోవాలని సభ్యులు పట్టు పడినట్లు తెలుస్తోంది. మున్సిపల్ ఎన్నికలకు ముందు ఆయా మున్సిపల్ కౌన్సిలర్లు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి నెరవేర్చకపోగా..ప్రజాధనాన్ని లూటీ చేస్తూ అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తరచు ఆరోపణలు వెల్లువెత్తుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో సర్వసభ్య సమావేశంలోనూ అధికార విపక్ష పార్టీలు ఒకరినొకరు ఇదే అంశాలపై దూషించుకోవడం ప్రస్తుతం హార్ట్ టాపిక్ గా మారింది. మరో 13 రోజుల్లో వీరి పదవి కాలం ముగుస్తున్న తరుణంలో ఒకరిపై ఒకరు నిందలు వేసుకుంటూ దూషణలు చేసుకోవడంతో..వచ్చే ఎన్నికల్లో వీరి పరిస్థితి ఏ విధంగా ఉండబోతుందన్న చర్చ ఆసక్తిని రేకెత్తిస్తుంది. గత రెండు రోజుత క్రితం సుమారు కోటి రూపాయలకు పైగా కార్మికుల వేతనాలను మెక్కేసిన సిబ్బందిపై ఇప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోగా..వాటిపై ఎలాంటి విచారణ కూడా చేపట్టకపోవడం పలు విమర్శలకు తావునిస్తోంది.


Similar News