బ్యాంక్ దోపిడీ యత్నం ముఠాలో బీ టెక్ లేడి..?

తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించిన వనపర్తి జిల్లా అమరచింత యూనియన్ బ్యాంక్ దోపిడీ యత్నం ముఠా ఎట్టకేలకు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది.

Update: 2025-01-05 11:24 GMT

దిశ, అమరచింత : తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర సంచలనం రేకెత్తించిన వనపర్తి జిల్లా అమరచింత యూనియన్ బ్యాంక్ దోపిడీ యత్నం ముఠా ఎట్టకేలకు పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ దొంగతనం కేసును సవాలుగా తీసుకున్న వనపర్తి జిల్లా ఎస్పీ రావుల గిరిధర్ కేసును ఛేదించినట్లు సమాచారం. ఆద్యంతం ఆసక్తిగా సినిమా స్టోరీని తలపించేలా, చోటుచేసుకున్న కేసు పూర్వాపరాలు విస్తుపోయే విధంగా ఉండడం ఆసక్తి రేకెత్తిస్తోంది.

ఈ దోపిడీ యత్నంలో వనపర్తి జిల్లాలోని ఓ గ్రామానికి చెందిన ఒకే కుటుంబ సభ్యులు కాగా.. అందులో పక్కా రెక్కీ, స్కెచ్ సూత్రధారి బీ టెక్ పూర్తి చేసిన వివాహిత ఉన్నట్లు సమాచారం. గత నెలలో వరుస సెలవులను ఎంపిక చేసుకున్న ఈ ముఠా ప్రతి రోజు మూడు రాత్రులు బ్యాంక్ దోపిడీకి పలు విధాలుగా యత్నించి విఫలమైనట్లు తెలుస్తుంది. పూర్తి వివరాలను జిల్లా ఎస్పీ సోమవారం మీడియాకు వివరించే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.


Similar News