కోయిల్ సాగర్ సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు
మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం ఆయకట్టు రైతులకు కుడి, ఎడమ కాలువల ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డితో కలిసి సాగునీటిని విడుదల చేశారు.

దిశ, దేవరకద్ర: మహబూబ్ నగర్ జిల్లా దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి మంగళవారం ఆయకట్టు రైతులకు కుడి, ఎడమ కాలువల ద్వారా దేవరకద్ర ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే ఎస్ రాజేందర్ రెడ్డితో కలిసి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆల మాట్లాడుతూ.. తెలంగాణ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు.
మన ముఖ్యమంత్రి కేసీఆర్ రైతు బీమా, రైతు బంధు, 24 గంటల ఉచిత విద్యుత్ లాంటి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రైతుల పాలిట ఆపద్బాంధవుడిగా తయ్యారయ్యారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకద్ర ఎంపీపీ రమ శ్రీకాంత్ యాదవ్, జడ్పీటీసీ అన్నపూర్ణ శ్రీకాంత్, పిఎసిఎస్ చైర్మన్ నరేందర్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు జెట్టి నరసింహారెడ్డి, కొండ శ్రీనివాస్ రెడ్డి శ్రీకాంత్ యాదవ్, కొండ భాస్కర్ రెడ్డి, దొబ్బలి అంజనేయులు, మున్నూరు బాలరాజు, దేవరకద్ర నియోజకవర్గ ప్రజాప్రతినిధులు, అధికారులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.