MLA Dr. Vamsikrishna : పోడు భూముల సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి..

అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు.

Update: 2024-07-24 12:00 GMT

దిశ, అచ్చంపేట : అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో బుధవారం అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ ప్రశ్నోత్తరాల సమయంలో మాట్లాడారు. ఆదివాసీ గిరిజనులు పోడు భూముల సమస్యల పై ప్రస్తావిస్తూ గళమెత్తాడు. పోడు భూముల సమస్య గత ప్రభుత్వం తీర్చగా కేవలం ఓటు బ్యాంకు గాని ఆదివాసీ గిరిజనులను వాడుకుందని, మన ప్రజా ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి పోడు భూముల సమస్యల పై పరిష్కారం చూపాలని సభాముఖంగా ముఖ్యమంత్రిని కోరారు. అలాగే అచ్చంపేట నియోజకవర్గం నల్లమలలో తండాలను అశాస్త్రీయంగా గ్రామ పంచాయతీలుగా చేయడానికి అసెంబ్లీలో ప్రస్తావిస్తూ ఇప్పటికి కూడా తండాలు, గూడాలలో గిరిజన ఆదివాసి ప్రాంతాల్లో మౌలిక వసతులు లేవని, రోడ్లు, త్రాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు గత ప్రభుత్వం విస్మరించింది కాబట్టి మన కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో జీపీ ప్రాంతాలకు మౌలిక వస్తువులు కల్పించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

గత ప్రభుత్వం తండాలను గ్రామ పంచాయతీలుగా విడదీసి తమ ఓటు బ్యాంకు లబ్ధి పొందడానికి మాత్రమే చేశాయని అసెంబ్లీలో ఎండగట్టాడు. నల్లమలలో గిరిజనులు ఆదివాసులు సాగు చేసుకుంటున్నటువంటి పోడు భూముల విషయంలో గత ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలలో ఎవ్వరు కూడా వ్యవసాయం చేసుకోవడానికి నోచుకోవడం లేదని సభా దృష్టికి తెచ్చారు. అందుకు స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క స్పందించి వెంటనే తండాలు, గిరిజన ప్రాంతాలు పోడు భూముల విషయంలో ప్రభుత్వం తగు చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఎం, మంత్రి సీతక్కకు ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ ధన్యవాదాలు తెలిపారు.

Tags:    

Similar News