టీఎస్ ఎస్టీయూ 2025 డైరీ, జీఓ పుస్తకం ఆవిష్కరించిన మంత్రి

రాష్ట్ర ప్రోహిబిషన్ ఎక్సైజ్, పర్యటక సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో టీఎస్ ఎస్టీయూ 2025 డైరీ,జీఓ పుస్తకంను ఆవిష్కరించారు.

Update: 2025-01-01 12:29 GMT

దిశ,కొల్లాపూర్: రాష్ట్ర ప్రోహిబిషన్ ఎక్సైజ్, పర్యటక సాంస్కృతిక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు బుధవారం కొల్లాపూర్ క్యాంపు కార్యాలయంలో టీఎస్ ఎస్టీయూ 2025 డైరీ,జీఓ పుస్తకంను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..మొట్ట మొదటి ఉపాధ్యాయ సంఘం ఎస్టియూ టీఎస్ డైరీ తన చేతుల మీదుగా ఆవిష్కరించడం సంతోషమన్నారు. ప్రభుత్వ పాఠశాలలో, చదివే విద్యార్థులకు నైతిక విలువలతో కూడిన విద్యను యోగ, మెడిటేషన్, క్రమశిక్షణను విద్యార్థులకు అందించాలని సూచించారు. పదవ తరగతిలో జిల్లా ఉత్తమ ఫలితాలు సాధించేలా కృషి చేయాలని మంత్రి జూపల్లి ఉపాధ్యాయలోకానికి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో టీఎస్ ఎస్టీ యూ జిల్లా అధ్యక్షులు సంగం మురళి, ప్రధాన కార్యదర్శి కే శ్రీధర్ రావు, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు హనుమంత రెడ్డి, రాష్ట్ర అడిషనల్ జనరల్ సెక్రెటరీ ఈశ్వర్, రాష్ట్ర కార్యదర్శి కే రమేష్, లక్ష్మారావు, జిల్లా కార్యదర్శి పోకల శేఖర్, నాగర్ కర్నూల్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు మధుసూదన్ రెడ్డి, బాల రెడ్డి, బాలస్వామి, కొల్లాపూర్ మండల అధ్యక్షులు వరప్రసాద్, ప్రధాన కార్యదర్శి చంద్రుడు, కోశాధికారి జాకీర్ హుస్సేన్ జిల్లా నాయకులు షఫీ , చెన్నయ్య, శివశంకర్, పెద్దకొత్తపల్లి మండల అధ్యక్షులు నందకిషోర్ యాదవ్, కోడేరు మండల బాధ్యులు ఎల్లయ్య, శేఖర్ ఎల్లయ్య, తదితరులు పాల్గొన్నారు .


Similar News