అభివృద్ధి చేసే ప్రభుత్వంకు అండగా నిలవాలి - మంత్రి నిరంజన్ రెడ్డి
తెలంగాణ రాష్ట్ర ముఖ్య కేసీఆర్ నాయకత్వం మూలంగా రాష్ట్రం తో పాటు వనపర్తి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ మార్గదర్శకంగా నిలిచిందని,అభివృద్ధి చేసే ప్రభుత్వం కు అండగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.
దిశ,వనపర్తి : తెలంగాణ రాష్ట్ర ముఖ్య కేసీఆర్ నాయకత్వం మూలంగా రాష్ట్రం తో పాటు వనపర్తి జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధిస్తూ మార్గదర్శకంగా నిలిచిందని,అభివృద్ధి చేసే ప్రభుత్వం కు అండగా నిలవాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు.ఆదివారం హైదరాబాద్ లోని కర్మన్ ఘాట్ వంగా అనంతరెడ్డి గార్డెన్స్, మణికొండ పంచవటి కాలనీలో హైదరాబాద్ లో నివాసం ఉంటున్న వనపర్తి ఓటర్ల ఆత్మీయ సమ్మేళనం కు రాష్ట్ర వ్యవసాయ శాఖా మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ గత పదేళ్లలో వనపర్తి నియోజకవర్గంలో వ్యవసాయ,విద్యా,వైద్య రంగాల్లో వందేళ్ల భవిష్యత్ కు గట్టి పునాదులు వేయడం ద్వారా గణనీయమైన ప్రగతి సాధించమన్నారు.వనపర్తి నియోజకవర్గం లో లక్ష పై చిలుకు ఎకరాలకు సాగునీరు తీసుకువచ్చామని,మరో 25 వేల ఎకరాలకు సాగునీరు రాబోతుందన్నారు.పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతలతో దక్షిణ తెలంగాణ సస్యశ్యామల మైందన్నారు.నూతనంగా నిర్మించబోయే ఐటీ టవర్ వనపర్తికి మరో ఐకాన్ గా నిలవనున్నదన్నారు.సాగునీటి రాకతో పాలమూరు వలసలు ఆగిపోయాయని,ఇతర రాష్ట్రాల నుంచి పాలమూరుకు ఉపాధి కోసం వలసలు వస్తున్నారన్నారు. అభివృద్ధిని గమనించి రానున్న ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీని మరోసారి ఆశీర్వదించాలని కోరారు.