నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యటించనున్న మంత్రి జూపల్లి..

నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు.

Update: 2025-01-06 03:57 GMT

దిశ, నాగర్ కర్నూల్ : నేడు నాగర్ కర్నూల్ జిల్లాలో పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పర్యటించనున్నారు. ఉదయం 8:30 గంటలకు కొల్లాపూర్ మండలం సింగోటం గ్రామంలో ఆధునీకరించిన ప్రైమరీ, జడ్పీహెచ్ఎస్ స్కూల్ భవనాలను ప్రారంభిస్తారు. 11 గంటలకు నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు.

మధ్యాహ్నం 12 గంటలకు పెద్దకొత్తపల్లిలో కళ్యాణ లక్ష్మి, సీఎంఆర్ఎఫ్ చెక్కులను లబ్ధిదారులకు అందజేస్తారు. 2 గంటలకు కోడేరు, కొల్లాపూర్, పెంట్లవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను కొల్లాపూర్ పోలీస్ స్టేషన్ నుంచి ప్రారంభిస్తారు. సాయంత్రం 4 గంటలకు సింగోటం లక్ష్మీనర్సింహ స్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్ల పై జిల్లాస్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తారు.

Tags:    

Similar News